గురువారం 24 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 04, 2020 , 02:32:43

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు

ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు

  •  అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

కోటపల్లి : గత నెల 28 నుంచి ఈనెల 3 వరకు నిర్వహించిన మావోయిస్టుల అమరుల సంస్మరణ వారోత్సవాలు సోమవారం ముగిశాయి. పక్కన ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో మావోయిస్టుల కదలికలు ఉండడంతో జిల్లా పోలీసులు ఈ వారం రోజుల పాటు అప్రమత్తంగా వ్యవహరించారు. కోటపల్లి, వేమనపల్లి మండలాలకు సరిహద్దుగానే మహారాష్ట్ర ఉండగా పోలీస్‌ ఉన్నతాధికారులు రెండు రాష్ర్టాల సరిహద్దుల పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. సరిహద్దులపై డేగ కన్ను వేయడంతో పాటు స్పెషల్‌ పార్టీ, సీఆర్‌పీఎఫ్‌ పోలీసుల ఆధ్వర్యంలో అడవులను జల్లెడ పడుతున్నారు. వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు సరిహద్దులపై గస్తీ పెంచారు. వారోత్సవాలు ముగిసినా పోలీసుల అడవుల్లో కుంబింగ్‌ నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. చెన్నూర్‌ రూరల్‌ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్‌ఐ రవి కుమార్‌ తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులతో పాటు జాతీయ రహదారి 63 పై విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులకు ముందుగానే కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారికి సహకరిస్తే తీసుకునే చర్యలను వివరించారు. పొరుగు రాష్ట్ర పోలీసులతో ఎప్పటికప్పడు పరస్పరం సమాచారం చేరవేసుకుంటూ ముందుకు సాగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.


logo