శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 04, 2020 , 02:32:44

‘కరోనా’ వేగంగా వ్యాప్తి చెందుతున్నది

‘కరోనా’ వేగంగా వ్యాప్తి చెందుతున్నది

  •  కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

ఆసిఫాబాద్‌ : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో ర్యాండమ్‌ షాంపిళ్లు తీసుకోవాలని వైద్యాధికారికి సూచించారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌లో వంద పడకలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో వంద పడకలు ఏర్పాటు చేసేలా గదులు సిద్ధం చేయాలని, భోజన వసతులు కల్పించాలని డీటీడబ్ల్యూవోను ఆదేశించారు. వైద్య, పోలీస్‌ సిబ్బందిని నియమించాలని సూచించారు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లలో పరీక్షలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాంబాబు, డీఆర్వో కే సురేశ్‌, ఆర్డీవో సిడాం దత్తు, జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, డీటీడీవో దిలీప్‌ కుమార్‌, డీపీవో రమేశ్‌, సీఐ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.


తాజావార్తలు


logo