బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Aug 02, 2020 , 02:47:32

మొక్కలకు ట్రీగార్డుల ఏర్పాటు

మొక్కలకు ట్రీగార్డుల ఏర్పాటు

బెల్లంపల్లి టౌన్‌ :  హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు బెల్లంపల్లి మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో బజార్‌ ఏరియా, కాంటా ఏరియా, ఇతర ఏరియాల్లోని రోడ్డు డివైడర్లపై ఏర్పాటు చేసిన మొక్కలు సంరక్షణ లేక ఎదిగేవి కావు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి కాల్‌టెక్స్‌ ఏరియా నుంచి కన్నాల వరకు రహదారుల వెంట మొక్కలు నాటడానికి నడుం బిగించారు. నాటిన మొక్కలు పశువులు తినకుండా ఉండేందుకు మున్సిపల్‌ సిబ్బంది ప్రతి మొక్కకు ట్రీ గార్డు ఏర్పాటు చేశారు. ప్రతి మొక్కకూ నిత్యం నీరు పోయాలని మున్సిపల్‌ సిబ్బందికి అధికారులు సూచిస్తున్నారు. పశువులను రహదారులపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పశువుల యజమానులకు ముందుగా నోటీసులు జారీ చేసి, ఇలాంటివి పునరావృతం అయితే భారీ జరిమానా  విధించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో బెల్లంపల్లి మున్సిపాలిటీ హరిత మున్సిపాలిటీగా రూపొందే అవకాశం ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


logo