శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Aug 02, 2020 , 02:47:31

నిరాడంబరంగా బక్రీద్‌

నిరాడంబరంగా  బక్రీద్‌

సిర్పూర్‌(టీ) : మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం బక్రీద్‌ వేడుకలను ముస్లింలు నిరాడంబ రంగా జరుపుకొన్నారు. కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ తమ ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు. 50 మంది మించ కుండా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒక రి కొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్‌ఐ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కాగజ్‌నగర్‌ టౌన్‌ : సిర్పూరు నియోజకవర్గంలోని ముస్లింలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బక్రీద్‌ పండుగ శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని పేర్కొన్నారు.  

బెజ్జూర్‌ : మండల కేంద్రంతో పాటు కుకుడ, మర్తిడి, ఎల్కపల్లి, గోల్కొండ గ్రామాల్లో ముస్లింలు బక్రీద్‌ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. మసీదుల్లో ఇమామ్‌లతో పాటు 10 మంది మించకుండా ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరి కొకరు శు భాకాంక్షలు తెలుపుకున్నారు.  

ఆసిఫాబాద్‌ :  మండలకేంద్రంలో ముస్లింలు కొవిడ్‌-19 నిబం ధనలు పాటిస్తూ ఇంటి వద్దే ప్రార్థనలు చేశారు. మసీదుల్లో నిర్ణీత మందితో ప్రార్థనలు నిర్వహించారు. పేద ప్రజలకు దు స్తులు, డబ్బులు అందజేశారు. 

జైనూర్‌ : జైనూర్‌, సిర్పుర్‌(యూ) మండలాల్లో బక్రీద్‌ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఈద్‌-ఉల్‌-అదా పండు గను పురస్కరించుకుని ఉయదం 6.30కు ప్రార్థనలు చేశారు. అనంతరం సామాజిక దూరం పాటిస్తూ పండుగ శుభకాంక్షలు తెలుపుకున్నారు.  

దహెగాం: మండలంలో మొట్లడు, గిరివెల్లి, ఒడ్డుగూడ, లగ్గాం, దహెగాం, కొంచవెల్లి, ఐనం, బీబ్రా, కొత్మీర్‌, గొర్రెగుట్ట తదిత ర గ్రామాల్లో బక్రీద్‌ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు ఇంట్లోనే చేసుకొని శుభకాంక్షలు తెలుపుకున్నారు.

చింతలమానేపల్లి : మండలంలోని బాబాసాగర్‌, డబ్బా, గూ డెం, రణవెల్లి గ్రామాల్లో బక్రీద్‌ వేడుకలు ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు.  ముస్లింలకు ప్రజాప్రతినిధులు, యువకులు శుభాకాంక్షలు తెలిపారు.   


logo