మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jul 31, 2020 , 01:35:31

సొంత చానల్‌లో పాఠాలు

సొంత చానల్‌లో పాఠాలు

  • ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయుడు తిరుపతి

దండేపల్లి: సొంత యూట్యూబ్‌ చానల్‌ ఏర్పాటు చేసి కరోనా కాలంలో విద్యార్థులకు తరగతులు చెప్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఉపాధ్యాయుడు మాలోతు తిరుపతి.  

దండేపల్లి మండలం, తానిమడుగు గ్రామానికి చెందిన మాలోతు తిరుపతి నాయక్‌ జగిత్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పీజీటీగా పనిచేస్తున్నాడు. కరో నా లాక్‌డౌన్‌ సమయంలో విద్యా సంస్థలన్నీ మూతపడడం తో విద్యార్థులకు ఎదో చేయాలని తన పేరుతో గత నెలలో యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ మన్ననలు పొందుతున్నాడు.

పాఠాలు వీక్షించలేని విద్యార్థులకు ఉచితంగా పెన్‌డ్రైవ్‌లు అందిస్తున్నాడు. తాను బోధించే పాఠాలను వీడియోలో చిత్రీకరించి పెన్‌డ్రైవ్‌లో పొందు పరుస్తున్నాడు. ఇప్పటి వరకు 102 మంది విద్యార్థులకు ఉచితంగా పెన్‌డ్రైవ్‌లు అందించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ సౌకర్యం లేని వారు పెన్‌డ్రైవ్‌ను టీవీకి అమర్చుకొని పాఠాలు వినవచ్చని అంటున్నాడు.

THIRUPATHI MALOTH SOCIAL CLASSES పేరుతో యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించిన తిరుపతి తన ఇంట్లోనే పాఠాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. విద్యార్థులకు అర్థమవుతుండడంతో వారి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో వీక్షకుల సంఖ్య 12,108కి పెరిగింది. logo