గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Jul 31, 2020 , 01:35:44

రైతు వేదికలు వేగంగా నిర్మించండి

రైతు వేదికలు వేగంగా నిర్మించండి

  • n సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా పూర్తవ్వాలి
  • n జాప్యం చేస్తే  సహించేది లేదు
  • n మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి ఆదేశం

దండేపల్లి/ మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌)/ లక్షెట్టిపేట రూరల్‌: రైతు వేదిక నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామం, హాజీపూర్‌ మండలంలోని ముల్కల్ల, గుడిపేట, కర్ణమామిడి గ్రామాలు, లక్షెట్టిపేట మండలం, సూరారం గ్రామంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ భవనాలతో రైతులకు మేలు కలుగుతుందన్నారు. రై తుల సమస్యలు, సమావేశాలు, ఇతర అంశా ల చర్చకు భవనం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్‌ చివరి కల్లా పూర్తి చే యాలని, సాకులు చెప్పి పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య, జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌కుమార్‌, మండల వ్యవసాయాధికారి అంజిత్‌కుమార్‌, సర్పంచ్‌ విఠల్‌, ఎంపీటీసీ ముత్తె రాజన్న ఉన్నారు. హాజీపూర్‌లో జేఈ కామేశ్వర్‌ రావు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ సంతోష్‌, ఎంపీడీవో అబ్దుల్‌హై, ఏపీవో మల్ల య్య, మాజీ వైస్‌ ఎంపీపీ మందపెల్లి శ్రీనివా స్‌, సర్పంచ్‌లు మంచాల శ్రీనివాస్‌, లగిశెట్టి లక్ష్మి, కొట్టె మహేందర్‌, కార్యదర్శులు, ఏఈవోలు పాల్గొన్నారు. లక్షెట్టిపేటలో ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్‌ పుష్పలత, ఏఈపీఆర్‌ శ్రుతి, ఎంపీవో అజ్మత్‌ అలీ, సర్పంచ్‌ మంచికట్ల శంకరయ్య, ఏపీవో వెంకటరమణ, ఆర్‌ఐ సంజీవ రావు, కార్యదర్శి వినతి, రైతు లు పాల్గొన్నారు.


logo