మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Mancherial - Jul 30, 2020 , 02:11:07

పనుల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

పనుల నిర్వహణకు  ప్రణాళికలు సిద్ధం చేయాలి

  • మున్సిపల్‌ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలి
  • పన్నులను వంద శాతం వసూలు చేయాలి
  • మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి
  • మున్సిపల్‌ కమిషనర్లు, అధికారులతో సమావేశం 

మంచిర్యాల రూరల్‌(హాజీపూర్‌) : ప్రజల అవసరాలకు అనుగుణంగా పనుల నిర్వహణ కోసం కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి మున్సిపల్‌ కమిషనర్లు, అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి కమిషనర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల వారిగా సిబ్బం ది, ఆదాయం, ఖర్చులు, పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా, వీధి దీపాలు, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, అదనంగా అవసరమయ్యే సిబ్బం ది సంఖ్య, ఇతర వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి అందించాలన్నారు. ప్రభు త్వం ప్రతిపాదించిన మేరకు ప్రతి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, గ్లౌస్‌లు, షూ జత, శానిటైజర్‌ బాటిల్‌, షర్ట్‌తో కూడిన కరోనా నిరోధక కిట్లు అందజేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ ప్రాంతంలోని క్లాక్‌ ట వర్‌, వైశ్యభవన్‌ సమీపంలో జంక్షన్‌తో పాటు ఓ వర్‌ బ్రిడ్జి వద్ద బస్‌ బే ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేశామని తెలిపారు. సంబంధిత పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి పురపాలిక పరిధిలో ఇంటి, కులాయి, షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని దుకాణాలు, ఇతరాత్ర పన్నులు వందశాతం వసూలు చేయాలని, డంప్‌ యార్డు, వైకుంఠధామం ఏర్పాట్లు, రోడ్లు, మురుగు కాలువలు, టాయిలెట్స్‌ నిర్మా ణం, నిర్వహణతో పాటు మున్సిపల్‌ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్‌, నస్పూర్‌, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.logo