ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jul 29, 2020 , 01:48:50

కరోనా చికిత్సకు సింగరేణి సిద్ధం

కరోనా చికిత్సకు సింగరేణి సిద్ధం

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : సింగరేణి ప్రాంతాల్లో కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో యాజమాన్యం చికిత్స అందించేందుకు పలు చర్యలను చేపడుతున్నది. ఈ మేరకు సింగరేణి సీఎండీ శ్రీధర్‌ ఆదేశాల మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుంచి అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లతో డైరెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆపరేషన్స్‌ అండ్‌ పా ఎస్‌. చంద్రశేఖర్‌, ఫైనాన్స్‌ బలరాం సింగరేణి వ్యాప్తంగా కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

హెటిరో కంపెనీకి చెందిన 1800 ఇంజిక్షన్లు..

సింగరేణి ప్రాంతాల్లో కరోనా వైరస్‌ సోకిన వారికి వెంటనే వైద్యం అందించేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో వెంటిలేటర్‌ సౌకర్యం ఉన్న మూడు దవాఖానలతో ఒప్పందం కుదుర్చుకున్నది. తాజాగా మరో మూడు దవాఖానలతో ఒప్పందం చేసుకున్నది. సీరియస్‌ కేసులను ఈ దవాఖానలకు తరలించనున్నారు. మరోవైపు 5000 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు కొనుగోలు చేయడమేగాక వ్యాధి నివారణకు హెటిరో కంపెనీ తయారు చేసిన 1800 డోసుల ఇంజిక్షన్ల ను సిద్ధం చేసింది. గురువారం ఏరియా దవాఖానలకు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించింది.

ప్రోత్సాహకాలు...

కరోనా వైద్య సేవల్లో ఉన్న సిబ్బందికి నెల జీతంపై పది శాతం అదనంగా కరోనా అలవెన్స్‌ చెల్లిస్తున్నారు. అదే సమయంలో కరోనా సేవల్లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ వారికి రోజుకు వారి జీతంపై రూ. 300 అదనంగా ఇస్తున్నారు. సింగరేణి ఏరియా దవాఖానల్లోని క్వారంటైన్‌ సెంటర్లలో వైద్య సిబ్బందికి సహాయకులను తక్షణమే సమకూర్చుకోవడానికి సైతం అనుమతించారు. వైద్య సిబ్బంది వారి సహాయకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అన్ని ఏరియాల్లో క్వారంటైన్‌ సెంటర్లను పూర్తి సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.logo