గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Jul 27, 2020 , 02:20:14

కేజ్‌వీల్స్‌తో జాగ్రత్త..

కేజ్‌వీల్స్‌తో జాగ్రత్త..

కేజ్‌వీల్స్‌తో పొలం దున్నడం ఓ సాహసమే.. ఏమాత్రం నిర్లక్ష్యంగా నడిపినా అంతే సంగతులు.. అజాగ్రత్త, తొందరపా టు వద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు. పొట్టి కూటి కోసం ట్రాక్ట ర్‌ డ్రైవర్లుగా పని చేస్తున్న వారు కేజ్‌వీల్స్‌తో పొలాలు దున్నుతూ వాటి కిందే పడి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. బాధిత కు టుంబాల్లో తీరని విషాదం నింపుతున్నది. - దండేపల్లి 

ప్రస్తుత వానకాలం సీజన్‌లో వరినాట్లు ప్రారంభ మయ్యాయి. రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అ య్యారు. ఓ వైపు రైతులు తమ పొలం త్వరగా దు న్నాలని, మరోవైపు ట్రాక్టర్ల యజమానులు పని వేగంగా పూర్తి చేయాలని ఒత్తిడి పెంచడంతో డ్రైవర్లు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కేజ్‌వీల్స్‌తో పొలం దుక్కి దున్ని ఒక మడి నుంచి మరో మడిలో కి వెళ్లేందుకు ఒడ్డు దిగుతుండగా ట్రాక్టర్‌ అదుపుత ప్పి బోల్తా పడింది. దీంతో సీసీసీ నస్పూర్‌లోని లక్ష్మీనగర్‌కు చెందిన తాళ్లపెల్లి రాము మట్టిలో కూరు కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎన్నో జరిగాయి.

నేలల్లో రకాలు కారణమే..

అన్ని నేలలు ఒకే రకంగా ఉండవు. ఓ చోట బుర ద, మరో చోట గట్టిగా ఉంటాయి. నీటి తడులు, నారు, గడ్డి ఉన్నచోట మూల మలుపుల వద్ద కేజ్‌వీ ల్స్‌ ట్రాక్టర్లు వేగంగా నడిపితే బోల్తా పడుతాయి. భూమి ఎగుడు దిగుడుగా ఉన్నప్పడు జాగ్రత్తలు తీసుకోవాలి. 

నైపుణ్యం లేకపోవడం వల్లే..

డ్రైవర్లకు పూర్తి స్థాయిలో నైపుణ్యం లేకపోవడం ప్రమాదాలకు మరో కారణం. ఓవర్‌ స్పీడ్‌తో దున్న డం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సీనియర్‌ డ్రైవర్లు చెబుతున్నారు. 20 సెంటీమీటర్ల లోతు దున్నితే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముందు టైర్లు బరువుగా లేకపోవడంతో ట్రాక్టర్‌ పైకి లేచి డ్రైవరు ్లకేజ్‌వీల్స్‌ కింద పడే అవకాశం ఉందంటున్నారు. ముందు టైర్లకు బరువున్న బిల్లలు బిగిస్తే కొంత ప్రమాదం తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. 

జాగ్రత్తలు తీసుకోండిలా..

ట్రాక్టర్‌కు కేజ్‌వీల్స్‌ బిగించేటప్పుడు ముందు భాగంలో బంపర్లకు కడ్డీలు, బిల్లలు బిగించాలి. బరువు ఎక్కువైతే మైలేజీ తక్కువ వస్తుందని, డీజిల్‌ ఎక్కువ కాలుతుందని వీటిని అమర్చడం లేదు. పొలంలో దిగే ముందు ట్రాక్టర్‌ కండీషన్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించాలి. ఎప్పడు ఒకే వేగంతో ట్రాక్టర్‌ నడపాలి. మూల మలుపుల వద్ద వేగం తగ్గించాలి. కేజ్‌వీల్స్‌ నడిపించేటప్పుడు ట్రాక్టర్‌కు కల్టీవేటర్‌ అమర్చుకోవాలి.

తొందరపాటు వద్దు.. 

కేజ్‌వీల్స్‌తో పొలం దున్నేటప్పడు ట్రాక్టర్‌ను డ్రైవ ర్లు జాగ్రత్తగా నడపాలి. పొలం త్వరగా దున్నాలనే తొందరపాటు వద్దు. నైపుణ్యం లేకపోవడం వల్ల డ్రైవర్లు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. యజమానులు, రైతులు తగిన జాగ్రత్తలు పాటించేలా చూడాలి. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. - అంజిత్‌కుమార్‌, ఏవో