శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Jul 26, 2020 , 02:01:47

శరవేగంగా డంప్‌యార్డులు

శరవేగంగా డంప్‌యార్డులు

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా జిల్లాలోని 18 మండలాల్లో డంప్‌ యార్డులను నిర్మించాలని 2017 ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకున్నది. ఒక్కో యార్డుకు రూ. లక్ష చొప్పున కేటాయించింది. మొదట్లో డంపింగ్‌ యా ర్డుల నిర్మాణం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం, పంచాయతీ నిధులతో 311 గ్రామ పంచాయతీల్లో నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదట్లో స్థల సేకరణ సమస్యగా మారింది. గ్రామ పొలిమేరల్లో భూమి లేకపోవడం, రైతులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో కొంత ఆలస్యమైంది. దీంతో అధికారులు ప్రభుత్వ భూమిని అన్వేషించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కలెక్టర్‌ భారతీ హోళికేరి డంప్‌యార్డుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టా రు. నిత్యం పల్లెల్లో పర్యటిస్తూ శరవేగంగా పనులు పూర్తి చేసేందుకు అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు.

పల్లె ప్రగతితో ముందుకు..

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు పరిశుభ్రంగా ఉం చేందుకు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టింది. గ్రామాలను శుభ్రపరచడంతోపాటు శ్మశాన వాటికలు, డం ప్‌ యార్డులు తదితర నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. మొదటి విడుత పల్లె ప్రగతిలో అధికారులు వీటి నిర్మాణానికి కసరత్తు చేశారు. కలెక్టర్‌ భారతీ హోళికేరి, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఉపాధి హామీ ఏపీవో మల్లేశం తదితరులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగారు. యా ర్డుల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించడంతో పాటు దాతల నుంచి స్థలాలను సైతం సేకరించారు. జిల్లావ్యాప్తంగా 275 డంప్‌యార్డులు మంజూరుకాగా, ప్రస్తుతం 35 చోట్ల నిర్మాణాలు పూర్తి చేశారు. 60 చోట్ల పనులు కొనసాగుతున్నా యి. కొన్ని చోట్ల స్థల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పూర్తి అయిన గ్రా మాల్లో  చెత్తను తీసుకువెళ్లి డంప్‌ యార్డుల్లో పడేస్తున్నారు. దీంతో చెత్త కుప్పలు లేకుండా వాడలన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. మిగితా చోట్ల పను లు వేగవంతం చేస్తున్నారు.