శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jul 26, 2020 , 02:01:48

గడువులోగా సీఎంఆర్‌ పూర్తి చేయాలి

గడువులోగా సీఎంఆర్‌ పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ భారతీ హోళికేరి

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : 2019-20 వానకాలంలో కొనుగోలు కేం ద్రాల నుంచి సేకరించిన వరి ధాన్యానికి సంబంధించి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. సీఎంఆర్‌ను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు.. జిల్లాలో 78,370 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 64,4 57 మెట్రిక్‌ టన్నులు పూర్తయిందని పేర్కొ న్నారు. ఈ నెల 31వ తేదీలోపు 13,913 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు మిల్లు లు మాత్రమే వంద శాతం సీఎంఆర్‌ పూర్తి చేశాయని పేర్కొన్నారు. మిగితా వాటిలో గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు నుంచి ఎండకాలం సీఎంఆర్‌ ప్రా రంభించాలని కోరారు. మిల్లర్లంతా ఇందు కు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రా వు, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్‌ గెడం గోపాల్‌, జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. 

పరికరాల కొనుగోలుకు కార్యాచరణ 

జిల్లాలో రైతులు వినియోగించే యంత్రా లు, పరికరాల కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో వ్యవసాయ పరికరాల కొనుగొలుకు సంబంధించిన కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యవసా య పరికరాల కొనుగోలుకు జిల్లాకు రూ. 25 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. మొదట జిల్లాలోని భీమారం మండలం బూర్గులపల్లి గ్రామంలో రైతుల సౌకర్యం కోసం కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచిం చారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఆర్డీవో శేషాద్రి, డీపీఎం రవీందర్‌, జ్యోతి, సంధ్య,ఉద్యానవన శాఖ అధికారి యుగేందర్‌, శ్రీనివాస్‌, అధికారు లు, తదితరులు పాల్గొన్నారు.