సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Jul 26, 2020 , 02:01:49

ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులు చేయాలి

ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులు చేయాలి

  • డీఎంహెచ్‌వో బాలు

ఆసిఫాబాద్‌ : జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ యాంటిజన్‌టెస్టులు చేయాలని డీఎంహెచ్‌వో కుమ్రం బాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపరింటెండెంట్లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 20 పీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీలు ఉన్నాయని, కరోనా లక్షణాలు ఉన్న వారికి వీటిలో ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులు చేయాలని సూచించారు. దీని కోసం ఆన్‌లైన్‌లో యాప్‌ను ఏర్పాటు చేశామని, కరోనా టెస్టుల వివరాలను ఎల్‌టీ(ల్యాబ్‌ టెక్నీషియన్లు)లు అందులో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ర్యాపిడ్‌ యాంటిజన్‌తో పరీక్షలు చేయడం ద్వారా 30 నిమిషాల్లో రిజల్ట్‌ వస్తుందని తెలిపారు. టీవీసీ పాజిటివ్‌గా వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించాలన్నారు. ప్రస్తుతం 975 కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు కరోనా లక్షణాలు కలిగిన వారి కోసం సమయం కేటాయించాలన్నారు. 


logo