శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jul 26, 2020 , 02:01:50

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • n మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు
  • n కలెక్టర్‌ భారతీ హోళికేరితో కలిసి సీతారాంపల్లి, లక్షెట్టిపేటలో రైతు వేదికల నిర్మాణానికి భూమి పూజ
  • n నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తవ్వాలని అధికారులకు ఆదేశం

సీసీసీ నస్పూర్‌ : రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లిలో శనివారం రైతు వేదిక భవన నిర్మాణ పనులకు కలెక్టర్‌ భారతీ హోళికేరితో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. రైతులకు వ్యవసాయ సమగ్ర సమాచారం తెలుసుకు నేందుకు, వ్యవసాయ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ వేదికలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గురువయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కమిషనర్‌ రాధాకిషన్‌, తహసీల్దార్‌ శేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తిరుపతి, సీసీసీ నస్పూర్‌, సీతారాంపల్లి, నస్పూర్‌ రైతుబంధు సమితి అధ్యక్షులు రాయమల్లు, రామన్న, పురుషోత్తం, పీఏసీఎస్‌ డైరెక్టర్లు ధర్ని మధు, లింగయ్య, మాజీ సర్పంచ్‌లు గోపాల్‌రావు, రాజేంద్రపాణి, రాజేశం, కౌన్సిలర్లు వేణు, మహేశ్‌, నాయకులు రామన్న, హైమద్‌, భానుచందర్‌, జాబ్రిగౌస్‌, కొమురయ్య, రాజం, ఖాలీద్‌ పాల్గొన్నారు. 

లక్షెట్టిపేట రూరల్‌ : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే దివాకర్‌ రావుతో కలిసి కలెక్టర్‌ భారతీ హోళికేరి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో లక్షెట్టిపేట, న స్పూర్‌ మండలాల్లో రైతు వేదికలు నిర్మించనున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాకు 55 రైతు వేదికలు మంజూ రు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 53, అర్బన్‌లో 2 నిర్మించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. నాణ్యత పాటించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి అప్పగించాలని అధికారుల ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ లింగన్న, తహసీల్దార్‌ పుష్పలత, మండల కన్వీనర్‌ రాజన్న, మున్సిపల్‌ చైర్మన్‌ కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు రమేశ్‌, నాయకులు పాల్గొన్నారు.