శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Jul 25, 2020 , 02:52:21

సాగు సంబురంగా..

 సాగు సంబురంగా..

  •   జిల్లాలో విస్తారంగా వానలు
  •   సాధారణంకంటే  అధిక వర్షపాతం నమోదు
  •   ప్రాజెక్టులకు చేరుతున్న వరద..
  •   జిల్లాలో 2,84,912  ఎకరాల్లో పంటలు
  •   ఇప్పటికే 80 శాతం వరకు పూర్తి

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తుండడంతో సాగు పనులు సంబురంగా సాగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడం తో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, ప్రాజెక్టులు నిండుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 80 శాతం సాగు అయిన ట్లు వ్యవసాయ శాఖ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2 శాతం అదనపు వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2,84,912 ఎకరాల్లో సాగు కాగా, మరికొన్ని చోట్ల రైతులు వరినారు వేసుకున్నారు. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 

సాధారణం కంటే అధిక వర్షపాతం..

జిల్లాలో ఇప్పటి వరకు సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. 6 మండలాల్లో అధికం , 9 మండలాల్లో సా ధారణం, 3 మండల్లాలో తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై మొదటివారం నుంచి ఇప్పటి వరకు హాజీపూర్‌లో 22 శాతం , కాసిపేటలో 24 , తాండూరులో 56, నెన్నలలో 31, బెల్లంపల్లిలో 36, కో టపల్లిలో 34 శాతం అదనపు వర్షపాతం నమోదయ్యింది. భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, మందమర్రి, మం చిర్యాల, నస్పూరు, జైపూర్‌, భీమారం, చెన్నూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జన్నారంలో 31 శాతం, దండేపల్లి మండలంలో 20 శాతం, లక్షెట్టిపేట మండలంలో 22 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది సంబంధిత అధికారులు తెలిపారు.

ప్రాజెక్టులకు జలకళ.. 

జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. భీమిని, నెన్నల, వేమనపల్లి, కాసిపేట తదితర మండలాల్లోని వాగులు, కోటపల్లి, వే మనపల్లి ప్రాంతాల్లో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతున్నాయి. ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థా యి నీటి మట్టానికి చేరుకున్నాయి. నీల్వాయి ప్రాజెక్టు 0.846 టీఎంసీలు కాగా, ఇన్‌ఫ్లో 600 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ ఫ్లో కూడా అదే స్ధాయిలో ఉంది. గొల్లవాగు ప్రాజ్టెకు నీ టి నిల్వ సామర్థ్యం 0.5675 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.3 008 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ర్యాలీవాగు సామర్థ్యం 0.4 08 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంది.  

2,84,912 ఎకరాల్లో సాగు..

జిల్లాలో 3,54,260 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పత్తి 1,85,827 ఎకరాలు, 1,63 695 ఎకరాల్లో వరి , 3,735 ఎకరాల్లో కందులు సాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా, జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,84,912 ఎకరాల్లో పంటలు  సాగు అయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వరి 1,05,875  ఎకరాల్లో వేసుకున్నారు. అది కూడా జన్నారం, దండేపల్లి, లక్ష్సెట్టిపేట మండలాల్లో ముందుగానే నారు వేసుకున్నారు. ఇక 1,017 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 1,73,568 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసుకున్నారు. 4,381 ఎకరాల్లో కందులు, 209 ఎకరాల్లో పెసర్ల్లు , 40 ఎకరాల్లో మినుములు , 22 ఎకరాల్లో మక్కజొన్న సాగు చేస్తున్నారు.