శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Jul 24, 2020 , 04:20:14

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారు

మంచిర్యాల టౌన్‌ /సీసీసీ నస్పూర్‌ : మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీల్లోని కో ఆప్షన్‌ పదవులకు  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు గురువారం ప్రకటించారు. వీరంతా తమ దరఖాస్తులను మున్సిపల్‌ కార్యాలయంలో అందజేశారు. కోఆప్షన్‌ సభ్యుల ఎంపికకు చివరి రోజు కావడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎమ్మెల్యే ప్రకటించారు. ఎంపికైన వారిలో అనుభవజ్ఞులు, ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కోటాలో జనరల్‌ స్థానం నుంచి మామిడిశెట్టి రమేశ్‌, మహిళా కోటాలో మాజీ కౌన్సిలర్‌ సుగుణ హండే, మైనార్టీ కోటా జనరల్‌ స్థానంలో తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ జాఫర్‌ హుస్సేన్‌, మహిళా కోటాలో ఆస్ఫియా సుల్తానా ఉన్నారు. కో ఆప్షన్‌ పదవులకు ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, చైర్మన్‌ పెంట రాజయ్య, కౌన్సిల్‌ సభ్యులకు, పార్టీ నాయకులకు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. నస్పూర్‌ మున్సిపాలిటీలో కో ఆప్షన్‌ పదవులకు గాను టీఆర్‌ఎస్‌ నుంచి సయ్యద్‌ ఖాదిరున్నీసాబేగం, మహ్మద్‌ నాసర్‌, ముత్తె రాజేశం, పెరుమాళ్ల భాగ్యలక్ష్మిని ఖరారు చేయగా, వీరు మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం దరఖాస్తులు అందజేశారు. 


logo