మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jul 24, 2020 , 04:09:34

గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

కోటపల్లి: ప్రతి గ్రామపంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి సూచించారు. జీపీల్లో అభివృద్ధి పనులపై కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎమ్మె ల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి, అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు, అధికారులతో గురు వారం సమీక్ష నిర్వహించారు. పల్లెప్రగతితో గ్రామాల దశ మారుతుందని, అవకాశాన్ని సర్పంచ్‌లు, మండల ప్రజా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి పల్లెకు వైకుంఠ ధామం, డంపింగ్‌ యార్డు, ఇంకుడు గుంతల నిర్మాణం, స్వచ్ఛమైన వాతావరణం కోసం మొక్క ల పెంపకం అవసరన్నారు. డంప్‌యా ర్డు, వైకుంఠ ధామాల నిర్మాణాలను పూర్తి సకాలంలో చేయకుంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఉపా ధి కూలీలందరికీ జాబ్‌ కార్డులు ఇచ్చి 100 రోజులు పని దినాలు కల్పించాలని సూచించారు. రైతు వేదికల భవన నిర్మాణాలను గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. డీఆర్డీవో శేషాద్రి, డీపీవో వీర బుచ్చయ్య, జడ్పీ సీఈవో నరేందర్‌, ఎంపీపీ మంత్రి సురేఖ, ఏపీడీ రాథోడ్‌ బిక్కు, ఎంపీడీవో లక్ష్మయ్య, తహసీల్దా ర్‌ జ్యోతి, ఏవో మహేందర్‌, ఎంపీవో సత్యనారాయణ, ఇరిగేషన్‌ జేఈ సా యిక సర్పంచ్‌లు, కార్యదర్శులు ఉపా ధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో సర్పంచ్‌లు పోటీ ప డాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమా ర్‌, జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి సూచించారు. మండలంలోని 31 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి పనులను 100 శాతం పూర్తి చేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. పల్లెల్లో ని సమస్యలు పరిష్కరించేందుకే ప్రభు త్వం ‘పల్లెప్రగతి’ చేపట్టిందన్నారు. 

వృక్ష సంపదతోనే మనుగడ

మందమర్రి: వృక్ష సంపదపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. ఏరియాలోని కేకే ఓసీ సమీపంలో సింగరేణి ఆ ధ్వర్యంలో నిర్వహించిన వృక్షారోహణ అభియాన్‌ వనమహోత్సవ హరితహారానికి జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భా గ్యలక్ష్మి, ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌తో కలిసి ఆమె మొక్క నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మనం నాటుతున్న మొక్కలు మనతోపాటు భావితరాలకూ మేలు చేస్తాయని చెప్పా రు. జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అడవులను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం నిర్వహిస్తున్నదన్నారు. ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ మాట్లాడుతూ సింగరేణి చైర్మన్‌ శ్రీధర్‌ ఆదేశాలతో ఆరో వి డుతలో 3.5 లక్షల మొక్కలను నాటినట్లు తెలిపారు. తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గద్దె రాజు, ఎస్‌ఐ భూమేశ్‌, ఎస్‌వోటూ జీఎం వెం కటేశ్వర్లు, డీవైపీఎం శ్యాంసుందర్‌, ప ర్యావరణ అధికారి ప్రభాకర్‌, ఫారెస్ట్‌ అధికారి రమణారెడ్డి, టీబీజీకేఎస్‌ ఏరి యా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌, 


logo