సోమవారం 26 అక్టోబర్ 2020
Mancherial - Jul 23, 2020 , 01:44:19

ఇంట్లోనే ఉండండి.. శ్రద్ధగా చదవండి

ఇంట్లోనే ఉండండి.. శ్రద్ధగా చదవండి

మందమర్రి రూరల్‌ : విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ శ్రద్ధగా చదువుకోవాలని జడ్పీ అ ధ్యక్షురాలు భాగ్యలక్ష్మి సూచించారు. బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాఠశాలకు అ నుమతి ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ పాఠ్య పుస్తకాలను సరఫరా చేసిందని, ఉపాధ్యాయుల సలహాలు తీసుకొని ఇం ట్లోనే ఉంటూ శ్రద్ధగా చదువుకోవాలని సూ చించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ గుర్రం మంగ, జడ్పీటీసీ ఎ ల్పుల రవి, పాఠశాల ప్రధానోపాధ్యాయు డు జయకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు అమీ రా పాషా, విఠల్‌, దీపిక, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్‌ ఎస్‌.శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ టీ నిరోషా పాల్గొన్నారు.  

బెల్లంపల్లిటౌన్‌: విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ బజార్‌ ఏరియా పాఠశాల విద్యార్ధులకు ఎమ్మెల్యే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు, సౌకర్యాలు సీఎం కేసీఆర్‌ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం భారతి, నాయకులు జక్కుల శ్రీధర్‌, లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.logo