గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jul 22, 2020 , 01:24:40

ప్రమాదాలను అరికట్టేందుకే సిగ్నల్స్‌

ప్రమాదాలను అరికట్టేందుకే సిగ్నల్స్‌

గర్మిళ్ల : మంచిర్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశామని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను మంగళవారం మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావు, రామగుండం సీపీ వీ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉపయోగపడుతాయన్నారు. డీఎంఎఫ్‌సీ నిధు లు రూ.30 లక్షల్లో నుంచి రూ.6 లక్షలతో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగతా రూ.24 లక్షలతో ఐబీ చౌరస్తా నుంచి పాత మంచిర్యాల వరకు డివైడర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్‌ శాఖ ఈ సిగ్నల్స్‌ ఏర్పాటు చేసిందన్నారు. నిబంధనలు పాటించి, ప్రమాదాలను అరికట్టాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ డీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, ఏసీపీ నరేందర్‌, మంచిర్యాల సీఐ ముత్తి లింగయ్య, ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్‌ఐలు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


logo