శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Jul 22, 2020 , 01:21:38

పర్యావరణ సమతుల్యత కాపాడాలి

పర్యావరణ సమతుల్యత కాపాడాలి

శ్రీరాంపూర్‌ : పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పోలీసులు కృషిచేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, రామగుండం సీపీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న హరితవనాన్ని మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే, సీపీ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ చాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన ఖాళీగా ఉన్న రెండెకరాల స్థలాన్ని చదును చేసి, సీఐ కోటేశ్వర్‌రావు, ఎస్‌ఐ మంగీలాల్‌ ప్రత్యేక శ్రద్ధతో హరితవనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అలాగే స్టేషన్‌ ఆవరణలో పూలు, తదితర మొక్కలు నాటి, హరితవనంగా మార్చారని చె ప్పారు. అంతకుముందు జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ, డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఇసంపెల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ తోట శ్రీనివాస్‌, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే, సీపీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ కోటేశ్వర్‌, ఎస్‌ఐ మంగీలాల్‌, రా జేందర్‌, ఏఎస్‌ఐలు అంజయ్య, ఓబులమ్మ, దేవిసింగ్‌, కౌన్సిలర్లు వంగ తిరుపతి, హైమద్‌, బెడిక లక్ష్మి, చీడం మహేశ్‌, బోయ మల్లయ్య, మాజీ సర్పంచ్‌లు మల్లెత్తుల రాజేంద్రపాణి, గుంట జగ్గయ్య, మాజీ ఉప సర్పంచ్‌ సిద్ధం శంకర్‌, నాయకులు సిద్ధం తిరుపతి, భవానీ శ్రీనివాస్‌, ఐత రాజేశ్వర్‌రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు. 


logo