ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jul 20, 2020 , 02:00:55

ఆషాఢం బోనాలు..

ఆషాఢం బోనాలు..

మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌

జిల్లాల్లో ఆదివారం ఆషాఢ మాసం బోనాలను భక్తులు సాదాసీదాగా నిర్వహించారు. ఆలయాల్లో కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాలలో పోచమ్మకు బోనాలు సమర్పించారు. దారి మైసమ్మకు కోళ్లు, మేకలను బలిచ్చారు. సింగరేణి కార్మికులు గనులపై దుర్గమ్మకు పూజలు నిర్వహించారు. వాడ వాడలా సైట్‌ పిల్లలు చేసుకున్నారు. కౌటాల మండల కేంద్రంలోని శ్రీ కంకాలమ్మ కేతేశ్వర ఆలయంలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులకు ఆలయ కమిటీ  చైర్మన్‌ సుల్వ కనకయ్య మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.       -మంచిర్యాల అగ్రికల్చర్‌/కౌటాల


logo