మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jul 18, 2020 , 02:54:45

పర్యావరణ రక్షణ అందరి బాధ్యత

పర్యావరణ రక్షణ అందరి బాధ్యత

  •   మందమర్రి జీఎం  శ్రీనివాస్‌
  •   కేకే ఓసీ ఆవరణలో వనమహోత్సవం

మందమర్రి : పర్యావరణ రక్షణ అందరి బాధ్యత అని సింగరేణి మందమర్రి ఏరియా జీఎం  శ్రీనివాస్‌ అ న్నారు. కేకే ఓసీ ఆవరణలో శుక్రవారం వనమహోత్సవం, హరితహారంలో భాగంగా మొక్కలు నా టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిం గరేణి ఆధ్వర్యంలో గతేడాది 3.5 లక్షల మొక్కలు నాటామని, ఈయేడు కూడా అదే ల క్ష్యం పెట్టుకున్నామన్నారు. కార్మికులు విధులు నిర్వహిస్తూనే పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని, ఇందుకోసం నివాస ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం ఏరియా పర్యావరణ అధికారి ప్రభాకర్‌,  అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో హరితహారం ప్రతి జ్ఞ చేయించారు. కార్యక్రమంలో కేకే ఓసీ పీవో పద్మనాభారెడ్డి, డీవైపీఎం ఎస్‌. శ్యాంసుందర్‌, మేనేజర్‌ ఎల్‌.రమేశ్‌, ఫారెస్ట్‌ అధికారి రమణారెడ్డి, సంక్షేమాధికారి ఆర్‌.సత్యనారాయణ, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, పిట్‌ కార్యదర్శులు, యూనియన్ల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

ఆర్కేపీ సీహెచ్‌పీ సందర్శన..

రామకృష్ణాపూర్‌; మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ ఏజీఎం జగన్మోహన్‌రావుతో కలి సి శుక్రవారం రామకృష్ణాపూర్‌ సీహెచ్‌పీని సందర్శించారు. సైడింగ్‌, బంకర్ల సామర్థ్యం, ట్రాక్‌లైన్‌, బంకర్ల పనితీరు, క్రషర్స్‌ను పరిశీలించారు. అనంతరం బొగ్గు రవాణాపై సూపర్‌వైజర్లు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీహెచ్‌పీ డీజీఎం చెరువు శ్రీనివాస్‌, రీజియన్‌ సేఫ్టీ ఈఅండ్‌ఎం ఝా, డీవైఎస్‌. చంద్రమౌళి, పిట్‌ కార్యదర్శులు జే. శ్రీనివాస్‌, ఆత్రం సంజీవ్‌ పాల్గొన్నారు.

శానిటైజర్‌ స్టాండ్‌ ప్రారంభం..

సీసీసీ నస్పూర్‌: నస్పూర్‌కాలనీ సింగరేణి డిస్పెన్సరీ లో ఏర్పాటు చేసిన టచ్‌లెస్‌  శానిటైజర్‌ స్టాండ్స్‌ను శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం లక్ష్మీనారాయణ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, డీజీఎం పర్సనల్‌ గోవిందరాజు, డీవైసీఎంవో విజయలక్ష్మి, పర్సనల్‌ మేనేజర్‌ అజ్మీరా తుకారాం, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. logo