గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jul 18, 2020 , 02:54:46

పథకాలను చూసే చేరికలు

పథకాలను చూసే చేరికలు

  • మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు
  • లక్షెట్టిపేటలో 25 మంది టీఆర్‌ఎస్‌లోకి..

లక్షెట్టిపేట రూరల్‌ : తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాలను చూసే చాలా మం ది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. లక్షెట్టిపేట ము న్సిపల్‌ 10వ వార్డు కౌన్సిలర్‌ గొడిసెల లక్ష్మితో పాటు తమ అనుచరులు 25 మం ది టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా, ఎమ్మెల్యే వారి కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ.. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా తెలంగాణ సర్కారు నూతన పథకాలు రూపొందిం చి, అమలు చేస్తున్నదన్నారు. వాటన్నింటినీ చూసి చాలా మం ది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ స ర్కారూ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించా రు. కానీ తెలంగాణ సర్కారు రైతును రాజును చేసిందన్నారు. పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నదన్నారు. పట్టణం అభివృద్ధిలో ముందంజలో ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం 10వ వార్డు కౌన్సిలర్‌ గొడిసెల లక్ష్మి మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభు త్వం, సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు అద్బుతంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివాస్‌ గౌడ్‌, గుండ సత్యనారాయణ పాల్గొన్నారు.


logo