బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Jul 17, 2020 , 02:06:56

మాటల్లో కాదు చేతల్లో చూపాలి

మాటల్లో కాదు చేతల్లో చూపాలి

  • అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం తగదు
  • 20 రోజుల్లోగా నిర్మాణాలు పూర్తికాకుంటే నోటీసులు
  • మంచిర్యాల కలెక్టర్‌  భారతీ హోళికేరి

జైపూర్‌: గ్రామాల అభివృద్ధి మాటల్లో కాదని చేతల్లో చూపాలని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో సర్పంచ్‌లు, అధికారులతో ఉపాధి హామీ పనులపై గురువారం సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మా ణం, కంపోస్టు షెడ్డు, ప్రకృతి వనాల ఏర్పాటుపై గ్రామా ల వారీగా ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. జైపూ ర్‌ మండలంలో 20 గ్రామాలుండగా ఒక్క గంగిపెల్లిలో కంపోస్టు షెడ్డు, శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తి కాగా మిగతా గ్రామాల్లో బేస్‌మెంట్‌, పిల్లర్ల వరకే ఉండడంపై సర్పంచ్‌లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో భూములు కేటాయించి ఆరు నెలలు పూర్తయినా మొదటి దశ పనులు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. 20 రో జుల్లో పనులు పూర్తి చేయని సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఉపా ధి పని కల్పించడంలో ప్రతి గ్రామం వెనుకబడి ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తుంటే సర్పంచ్‌లు నిర్లక్ష్యంగా ఉండ డం సరికాదన్నారు. సర్పంచ్‌లు పద్ధతి మార్చుకోకుంటే పెన్నుకు పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశంలోనే ఉపాధి పనుల్లో రాష్ట్రం ముం దుందని తెలిపారు. ఇప్పటి వరకు కంపోస్టు షెడ్డు, శ్మశాన వాటిక పనులు ప్రారంభించని కిష్టాపూర్‌ సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వనా ల ఏర్పాటుకు ఏ గ్రామాల్లో స్థలాలు గుర్తించారు, ఏఏ గ్రామాల్లో పనులు మొదలు పెట్టారని అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వనాల పెంపు వేగవం తం చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పల్లె ప్రగతి 365 రోజులు కొనసాగించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీపీ రమాదేవి, డీఆర్డీవో శేషాద్రి, ప్రత్యేకాధికారి వెంకటరమణ, తహసీల్దార్‌ ప్రసాద్‌వర్మ, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. 


logo