శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Jul 17, 2020 , 02:07:00

కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి చర్యలు

  • కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

ఆసిఫాబాద్‌: కరోనా కట్టడికి జిల్లాలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో గురువారం సమీక్షించారు. జిల్లాలో కొవిడ్‌-19 అ నుమానిత కేసులు పెరుగుతున్నందున కాగజ్‌నగర్‌లోని పోస్ట్‌ మెట్రిక్‌ బాలికల వసతి గృహం లో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు గోలేటి క్వారంటైన్‌ సెంటర్‌లో ఏడు గురు, గోలేటి డిస్పెన్సరీలో 52 మంది, ఆసిఫాబాద్‌ పీహెచ్‌సీలో 47 మం ది ఉన్నారని పేర్కొన్నారు. 106 మంది నమూనాలను పరీక్షలకు పంపినట్లు చెప్పారు. సీజనల్‌ వ్యాధులు దరిచేరకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మురుగు నీటిని తొలగించాలని, తాగునీటి ఆవాసాల్లో బ్లీచింగ్‌ వేయాలని డీపీవో రమేశ్‌ను ఆదేశించారు. బుధవా రం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు వాంకిడి చెక్‌పోస్టు గుండా జిల్లాలోకి 20 వాహనాలు రాగా, ఇందులో 67 మంది ఉన్నారని 11 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్‌ రాంబాబు, డీఆర్వో సురేశ్‌, ఆర్డీవో సిడాం దత్తు, జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, డీటీడీవో దిలీప్‌ కుమార్‌, ఏవీఐ ఉమామహేశ్వర్‌ రావు తదితరులు ఉన్నారు. 

రైతు వేదిక భవనాల నిర్మాణం వేగవంతం చేయండి

రైతు వేదిక భవనాల నిర్మాణాలను వేగవం తం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. నెలలోగా ఇంటర్‌ లెవెల్‌ ఉండేలా చర్య లు చేపట్టాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా జైనూర్‌, సిర్పూర్‌-యు, లింగాపూర్‌, తిర్యాణి, కెరమెరి మండలాలకు సంబంధించి రైతు వేదికలు 19, ఆర్‌అండ్‌బీ ద్వారా సిర్పూర్‌-టి, కౌటాల, వాంకిడి వేదికలు 18, డీపీఆర్‌ ఈపీఐయూ ద్వారా ఆసిఫాబాద్‌, రెబ్బె న, పెంచికల్‌పేట్‌, దహెగాం, కాగజ్‌నగర్‌లో 23, టీఎస్‌ఈడబ్ల్యూ ఐడీసీ శాఖ ద్వారా చింతలమానేపల్లి, బెజ్జూర్‌లో 10 రైతు వేదిక భవనా లు నిర్మించాలన్నారు. జిల్లాలో 70 భవన ని ర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. భూ గర్భ గనుల శాఖ అధికారి సూచించిన గ్రామా ల్లో కాగజ్‌నగర్‌లోని రాసపల్లి, బెజ్జూర్‌ ఇసుకను ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేయాలని సూ చించారు. సంబంధిత అధికారులు సామగ్రి స రఫరా చేస్తే ఎఫ్‌టీవోలో జనరేట్‌ చేయాలన్నా రు. అదనపు కలెక్టర్‌ రాంబాబు, వ్యవసాయశాఖ అధికారి రవీందర్‌, డీఆర్డీవో వెంకటశైలేశ్‌, డీటీడబ్ల్యూవో దిలీప్‌ కు మార్‌, పీఆర్‌ ఈఈ వెంకట్రావ్‌, డీపీవో రమేశ్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, మైనింగ్‌ శాఖల అధికారులున్నారు.


logo