మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jul 16, 2020 , 02:38:21

జోరుగా వర్షం

జోరుగా వర్షం

జిల్లాలో మూడు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తు న్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతుండగా, ప్రాజెక్టులు నిండుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 48 శాతం అదనపు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబు తుండగా, పదును వానలు పడుతుండడంతో రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతున్నది. జిల్లావ్యా ప్తంగా 2,19,855 ఎకరాల్లో సాగు మొదలు కాగా, ఇప్పటికే జీలుగ, జనుము విత్తనా లు వేయడంతో పాటు దుక్కులు దున్నుతూ అన్నదాతలు బిజీగా గడుపుతున్నారు. వారం, పది రోజుల్లో వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతుండగా, ప్రస్తుతం పడుతున్న వానలు కర్షకులకు మేలు చేయనున్నాయి.                       - మంచిర్యాల, నమస్తే తెలంగాణ

మంచిర్యాల, నమస్తే తెలంగాణ:  జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుం డడంతో, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భీమిని, నెన్నెల, వేమనపల్లి, కాసిపేట, చెన్నూర్‌ తదితర మండలాల్లో వాగులు పొంగిపొర్లుతు న్నాయి. వేమనపల్లి మండలంలో నీల్వాయి ప్రా జెక్టు మత్తడి దూకింది. దీంతో దిగువన ఉన్న వా గుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెనపై నీరు ప్రవహించడంతో 24 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బతుకమ్మ వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కోటపల్లి, వేమనపల్లి ప్రాంతాల్లో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. ఇక ర్యాలీ వాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. 

సాధారణం కంటే అధికం..

జిల్లాలో ఇప్పటి వరకు సాధారణం కంటే అధికం గా వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఒక్క మండలం మినహా అన్ని మండలాల్లో సాధారణం అంత కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బెల్లంపల్లి మండలంలో 205 మి.మీ వర్షపాతం నమోదు కాగా, దండేపల్లి మం డలంలో 116 మి.మీ, జైపూర్‌లో 116 మి.మీ, నెన్నెల మండలంలో 107 మి.మీ, నస్పూరు మండలంలో 105 మి.మీ, తాండూరు మండ లంలో 62 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక లక్ష్సెట్టిపేట, హాజీపూర్‌, కాసిపేట, బీమిని, కన్నెప ల్లి, మంచిర్యాల, కోటపల్లి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. భీమారం, చెన్నూరు, మందమర్రి, జన్నారంలో సాధారణం, వేమనపల్లి మండలంలో తక్కువ వర్షపాతం నమోదైంది.

2,19,855 ఎకరాల్లో సాగు..

జిల్లాలో ఆయకట్టు, నాన్‌ ఆయకట్టు ప్రాంతాల్లో 3,54,260 ఎకరాల్లో వివిధ రకాలైన పంటలు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెబు తున్నారు. పత్తి 1,85,827 ఎకరాల్లో, వరి 1,63 695 ఎకరాల్లో, కందులు 3,735 ఎకరాల్లో సా గు చేస్తారని అధికారులు అంచనా వేశారు.   వర్షా లు ఎక్కువగా పడితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు వ్యవసాయ ప్రణా ళికలో వెల్లడించారు. వర్షాలు సక్రమంగా కురు స్తుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,19, 855 ఎకరాల్లో పంటలు వేసుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 53,550 ఎకరాల్లో వరి వేసుకున్నారు. అది కూడా జన్నారం, దండేపల్లి, లక్ష్సెట్టిపేట మండలా ల్లో ముందుగానే నారు వేసుకున్నారు. ఇక జిల్లా లో అత్యధికంగా 1,62,680 ఎకరాల్లో పత్తి విత్త నాలు వేసుకున్నారు. కందులు 3455 ఎకరాల్లో, పెసళ్లు 170 ఎకరాల్లో, మినుములు 30 ఎకరా ల్లో సాగు చేస్తున్నారు.  logo