శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jul 16, 2020 , 02:38:22

హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు

హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు

కాసిపేట : హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని సింగరేణి డైరెక్టర్లు తెలిపారు. మందమర్రి ఏరియాలోని కాసిపేట-2 ఇైంక్లెన్‌ భూ గర్భ గనిని డైరెక్టర్లు ఎస్‌ చంద్రశేఖర్‌ (ఆపరేషన్స్‌),బీ భాస్కర్‌రావు (ప్రాజెక్ట్‌, ప్లానింగ్‌) బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గని ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సింగరేణి అధికారులతో సమావేశం నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో బొగ్గు డిమాండ్‌ తగ్గిందని, దీంతో ఉత్పత్తి చేసిన బొగ్గును నిల్వ చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్‌, గ్రూప్స్‌ ఏజెంట్‌ కుర్మ రాజేందర్‌, వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మైత్రేయ బంధు, ఏఐటీయూసీ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు దాగం మల్లేశ్‌, టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి కారుకూరి తిరుపతి, ఏఐటీయూసీ పిట్‌ కార్యదర్శి పులి శంకర్‌, టీబీబీజీకేఎస్‌ నాయకులు బైరగోని సిద్ధయ్య, సింగరేణి అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం

కాసిపేట 2 గనిపై సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ మొక్కలు నాటారు. వాటి రక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు, నాయకులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌ : మందమర్రి ఏరియా ఆర్కేపీ ఓసీపీ, కేకే ఓసీపీని సింగరేణి డైరెక్టర్లు ఎస్‌ చంద్రశేఖర్‌, భాస్కర్‌ రావు, మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ బుధవారం సందర్శించారు. ఆర్కేపీ ఓసీపీ పరిసరాల్లో మొక్కలు నాటారు. ఉత్పత్తికి సంబంధించి ప్రాజెక్టు ఆఫీసర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఓసీపీ క్వారీల్లో చేపట్టిన పనులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం వెంకటేశ్వర్‌రావు, ఆర్కేపీ ఓసీపీ పీవో మధుసూదన్‌, గని మేనేజర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు, డీవై పీఎం శ్యాంసుందర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

శ్రీరాంపూర్‌ : నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధి మూడోవార్డు ఆర్కే-6 కాలనీలో చైర్మన్‌ ఇసంపెల్లి ప్రభాకర్‌, కౌన్సిలర్‌ పంబాల గంగా ఎర్రయ్య ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హరితహరంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. పట్టణంలోని ప్రతి ఇంటికీ  ఆరు మొక్కలు అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బోయ మల్లయ్య, ప్రత్యేకాధికారి పెద్దపల్లి గోపి, నాయకులు నాసర్‌, తదితరులు  పాల్గొన్నారు.  

చెన్నూర్‌ రూరల్‌ : హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడం అందరి బాధ్యత అని ఎంపీపీ మంత్రి బాపు అన్నారు. మండలంలోని అంగ్రాజ్‌పల్లి పీహెచ్‌సీలో జడ్పీటీసీ మోతె తిరుపతితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, ఎంపీడీవో మల్లేశం, డాక్టర్‌ అరుణశ్రీ, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.