మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jul 16, 2020 , 02:38:49

ఊటీ కాదు.. మన దస్తురాబాద్‌

ఊటీ కాదు.. మన దస్తురాబాద్‌

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రకృతి అందాలకు కొదవలేదు. ఇక వానకాలం వచ్చిందంటే ఎటూ చూసినా కనుచూపు మేర తివాచీ పరిచినట్టుండే పచ్చందాలు కనువిందు చేస్తాయి. బుధవారం నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలంలో తేలికపాటి జల్లులు కురిశాయి. అనంతరం ప్రకృతి రూపు మారిపోయింది. ఆహ్లాద పరిచే వాతావరణం, ఎర్రనినేల, నీలివర్ణపు ఆకాశాన్ని తాకుతున్నట్టుండే చెట్లు,  పచ్చని గుట్టల నుంచి వెలువడుతున్న పొగమంచు ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించడం ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరిచింది. ఊటీ, కొడైకెనాల్‌ ప్రాంతాలను తలపించింది. ఈ చిత్రాన్ని ‘నమస్తే’ క్లిక్‌ మనిపించింది.

- దస్తురాబాద్‌ logo