బుధవారం 05 ఆగస్టు 2020
Mancherial - Jul 15, 2020 , 02:26:01

పచ్చదనం పెంపొందించాలి

పచ్చదనం పెంపొందించాలి

  • మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు 

మంచిర్యాలటౌన్‌ : మంచిర్యాల పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆరో విడుత ‘హరితహారం’లో భాగంగా మంగళవారం పట్టణంలోని 36వ వార్డులో ఏపుగా పెరిగిన 40 మొక్కలను రోడ్లకు ఇరువైపులా నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ‘హరితహారం’లో అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెం పొందించాలని, పర్యావరణ సమతౌల్యతకు చె ట్లు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఆ మేరకు అందరూ తమ వంతుగా మొక్కలు నా టాలని సూచించారు. మంచిర్యాల పట్టణంలోని అన్ని వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టాలన్నారు. రోడ్లకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్‌ జీ ముఖేశ్‌గౌడ్‌, ఎమ్మెల్యే తనయుడు విజిత్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు అత్తి సరోజ, రాకేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


logo