మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jul 15, 2020 , 02:26:06

ప్రభుత్వ పథకాలతో రైతు రాజు కావాలి

ప్రభుత్వ పథకాలతో రైతు రాజు కావాలి

  • కుమ్రం భీం ఆసిఫాబాద్‌  జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
  • జైనూర్‌, సిర్పూర్‌(యు)  మండలాల్లో పర్యటన
  • జంగాం, రాసిమెట్ట,  మహాగాం, పంగిడి గ్రామాల్లో రైతువేదిక భవనాల నిర్మాణానికి భూమిపూజ

జైనూర్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని రైతు రాజు కావాలని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జ డ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సూచించారు. జైనూర్‌, సిర్పూర్‌ (యు) మండలాల్లో మంగళవారం పర్యటించా రు. ముందుగా జైనూర్‌ మండలంలోని జంగాం గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో రైతులను ఏ సర్కారూ పట్టించుకోలేదని విమర్శించారు. కానీ, అన్ని విధాలా ఆదుకుంటూ రైతును రాజు చేయాలని తపించేది ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. ఇందులో భాగంగా రైతుబంధు, రైతుబీమా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు. అలాగే సమస్యలను రైతులే చర్చించుకొని పరిష్కరించుకునేందుకు వీలుగా రైతు వేదిక భవణాలు నిర్మిస్తున్నారని చెప్పారు. అనంతరం రాసిమెట్ట గ్రామం లో, సిర్పూర్‌(యు) మండలంలోని మహాగాం, పంగిడి గ్రామాల్లోనూ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. జైనూర్‌ కార్యక్రమాల్లో రాష్ట్ర హజ్‌కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాలా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ అబుతాలిబ్‌, ఎంపీపీ కుమ్ర తిరుమల, సహకార సంఘం చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, వైస్‌ ఎంపీపీ చిర్లెలక్ష్మణ్‌, ఎంపీటీసీలు లట్పటె మహదవ్‌, భగవంత్‌రావ్‌, సర్పంచ్‌లు మేస్ర పార్వతి లక్ష్మణ్‌, మడావిభీంరావ్‌, కుంర శ్యాంరావ్‌, నాయకులు అజ్జులాలా, సిర్పూర్‌(యు)లో ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి, వైస్‌ ఎంపీపీ ప్రకాశ్‌, మాజీ ఎంపీపీ ఆత్రం భగవంత్‌రావ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తొడసం ధర్మరావ్‌,  సర్పంచ్‌ ఆత్రం వీణాబాయి, జాలింషావ్‌, వెంకట్‌రావ్‌ పాల్గొన్నారు.logo