శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Jul 14, 2020 , 03:37:51

‘హరితహారం’లో సింగరేణి ముందంజ

‘హరితహారం’లో సింగరేణి ముందంజ

  •  మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌

సీసీసీ నస్పూర్‌ : ‘హరితహారం’లో భాగంగా మొక్కలు నా టి, సంరక్షించడంలో సింగరేణి యాజమాన్యం ముందంజలో ఉన్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌ వెల్లడించారు. సీసీసీ టౌన్‌షిప్‌లోని ఆర్కే-5 కాలనీలో ఏరియా జనరల్‌ మేనేజర్‌ కందుకూరి లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ చైర్మన్‌ ఇసంపల్లి ప్రభాకర్‌, ఏరి యా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా 58 లక్షల మొక్కలు నాటాలని యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఇప్పటి వరకు నాటి న మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ఆరో విడుత హరితహారంలో శ్రీరాంపూర్‌ ఏరియాలో 5 లక్షల మొక్కలు నా టనున్నట్లు జీఎం లక్ష్మీనారాయణ చెప్పారు. ఇంటింటికీ పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ జీఎం రాజేశ్వర్‌, ఎస్‌వోటూజీఎం కుమారస్వామి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధాకిషన్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ బండి పద్మ, పర్యావరణ అధికారి అమరేందర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధులు వీరభద్రయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, రీజియన్‌ కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్‌, రాజనాల రమేశ్‌, డీవైసీఎంవో డాక్టర్‌ విజయలక్ష్మి, అధికారులు శివరావు, చిరంజీవులు, అజ్మీరా తుకారాం, బాలసుబ్రహ్మణ్యం, సత్యనారాయణ పాల్గొన్నారు.