ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jul 14, 2020 , 03:37:52

రైతు సంక్షేమానికి సర్కారు పెద్దపీట

రైతు సంక్షేమానికి సర్కారు పెద్దపీట

  • ఎమ్మెల్సీ పురాణం, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
  • రెబ్బెన, కైర్‌గాం, తక్కలపల్లిల్లో  ‘రైతు వేదిక’ భవనాల నిర్మాణానికి  భూమిపూజ
  • రెబ్బెన పీఏసీఎస్‌ ఆవరణలో ‘హరితహారం’
  •  ఆసిఫాబాద్‌లో శ్మశాన వాటిక, డంప్‌యార్డుల పరిశీలన

రెబ్బెన : రైతు సంక్షేమానికి సర్కారు పెద్దపీట వేసిందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. రెబ్బెన మండలంలోని రెబ్బెన, కైర్‌గాం, తక్కలపల్లి గ్రామాల్లో రైతు వేదిక భవనాల నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. దసరా నాటికి నిర్మాణాలు పూర్తి కావాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ‘రైతుబంధు’ నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. డబ్బులు జమకాని రైతులకు వెంటనే అందేలా అధికారులు కృషిచేయాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన విధంగా 100 శాతం నియంత్రిత పద్ధతిలో పంటసాగు చేయడం శుభసూచికమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రియాజ్‌అలీ, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, ఏవో మంజుల, ఏఈవో రాకేశ్‌, టీఆర్‌ఎస్‌ రెబ్బెన మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, జడ్పీటీసీ వేముర్ల సంతోష్‌, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, వైస్‌ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, పీఎసీఎస్‌ చైర్మన్‌ కార్నాథం సంజీవ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ రంగు మహేశ్‌గౌడ్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చెన్న సోమశేఖర్‌, సర్పంచ్‌లు బొమ్మినేని అహల్యాదేవి, పందిర్ల వినోద, ఉప సర్పంచ్‌ మడ్డి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీటీసీలు పెసరి మధునయ్య, సంఘం శ్రీనివాస్‌, వోల్వోజు హరిత, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు కుందారపు శంకరమ్మ, గాదవేణి మల్లేశ్‌, డైరెక్టర్‌ మోడెం వెంకటేశ్‌, నాయకులు జుమ్మిడి అనందరావు, పందిర్ల మధునయ్య, మోడెం సుదర్శన్‌గౌడ్‌, వినోద్‌ జైస్వాల్‌, అన్నపూర్ణ శాంతిగౌడ్‌, దుర్గం భరద్వాజ్‌, అన్నపూర్ణ అరుణ, పిల్లి లత, తదితరులు పాల్గొన్నారు.

‘హరితహారం’లో అందరూ మొక్కలు నాటాలి..

హరితహారంలో భాగంగా రెబ్బెన పీఏసీఎస్‌ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘హరితహారం’లో అందరూ మొక్కలు నాటి, సంరక్షించాలని సూచించారు.

శ్మశానవాటిక, డంప్‌యార్డు పనుల పరిశీలన..

ఆసిఫాబాద్‌ : శ్మశాన వాటిక, డంప్‌ యార్డుల పనులను వేగవంతం చేయాలని జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలసి సోమవారం పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో శ్మశాన వాటికలు నిర్మిస్తున్నదన్నారు. నిర్మాణంలో అలసత్వం వహించవద్దని సంబంధిత అధికారులకు సూచించారు. వారి వెంట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చిలువేరు వెంకన్న, ఎంపీటీసీ గాదెవెణి మల్లేశ్‌, డీపీవో రమేశ్‌, తహసీల్దార్‌ ఎజాజ్‌ఖాన్‌, ఈవోపీఆర్డీ ప్రసాద్‌, సర్వేయర్‌ భరత్‌, కార్యదర్శి రాజబాబు, తదితరులున్నారు.logo