శనివారం 08 ఆగస్టు 2020
Mancherial - Jul 13, 2020 , 01:23:27

ఘనంగా ఆషాఢం బోనాలు..

ఘనంగా ఆషాఢం బోనాలు..

మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఆదివారం ఆషాఢమాసం బోనాలు నిర్వహించారు.  మైసమ్మ, మహంకాళీ అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు బాగుండాలని, అందరూ సుఖసంతోషాలతో మెలగాలని వేడుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 68 డిప్‌ సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. మున్సిపల్‌ అధ్యక్షురాలు జక్కుల శ్వేతతో కలిసి బోనమెత్తారు. ప్రత్యేక పూజలు చేసి, బోనం సమర్పించారు. అలాగే కాగజ్‌నగర్‌ పట్టణం సర్‌సిల్క్‌ కాలనీలోని మహంకాళీ అమ్మవారికి ఎమ్మెల్యే సిర్పూర్‌ కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి మొక్కులు చెల్లించారు. పట్టువస్ర్తాలు, బోనం సమర్పించారు.    - బెల్లంపల్లిటౌన్‌/కాగజ్‌నగర్‌ టౌన్‌

ఆషాఢం సందర్భంగా ఆదివాసులు, తమ సంప్రదాయాలతో ఆదివారం భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. తాండూర్‌ మండలం కిష్టంపేట పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో మన్నెవార్లు అకాడీ నిర్వహించారు. ఉదయమే బిందెల్లో నీళ్లతో డప్పచప్పుళ్ల నడుమ పొలిమేరకు చేరుకొని, రోడ్డుపై ఆరగింపుచేశారు. అనంతరం భీమన్న గుడిలో మొక్కులు చెల్లించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, అందరూ చల్లంగుండాలని వేడుకున్నారు.   - తాండూర్‌ logo