సోమవారం 03 ఆగస్టు 2020
Mancherial - Jul 12, 2020 , 01:30:27

వైభవంగా మాస దీపోత్సవం

వైభవంగా మాస దీపోత్సవం

కరీంనగర్‌ కల్చరల్‌ : నగరంలోని యజ్ఞవరాహస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం మాస దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం యజ్ఞవరాహ పదార్చన, హరినామ సంకీర్తన, ఏకాంత సేవ నిర్వహించారు. అర్చకులు కరోనా నివారణ కోసం సంకల్పం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వవైదిక సంస్థానం ఉపకులపతి శ్రీభాష్యం వరప్రసాద్‌, భక్తులు పాల్గొన్నారు. logo