సోమవారం 03 ఆగస్టు 2020
Mancherial - Jul 12, 2020 , 01:30:27

ఊరూరా సాగు సంబురం

ఊరూరా సాగు సంబురం

  •  సకాలంలో అందిన పెట్టుబడి సాయం
  • వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలు 

కరీంగర్‌ రూరల్‌: కరీంనగర్‌ మండలంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో ఎటు చూసినా రైతులు పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు. పొలాలు దున్ని వరి నాట్లు వేస్తున్నారు. పత్తి చేలల్లో కలుపు తీస్తున్నారు. ఎరువులు తీసుకువచ్చి నిల్వ చేసుకుంటున్నారు. సకాలంలో వర్షాలు పడడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం, నిరంతర ఉచిత విద్యుత్‌ ఇస్తుండడంతో ఉత్సాహంగా సాగు పనులు చేపడుతున్నారు. 17 గ్రామ పంచాయతీల పరిధిలో 10018 మంది రైతులకు పెట్టుబడి సాయం అందింది. నియంత్రిత సాగు విధానంలో భాగంగా రైతులు వరి సన్నాలు, దొడ్డు రకంతో పాటు పత్తి సాగు చేస్తున్నారు. 


logo