సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Jul 12, 2020 , 01:30:28

పరిమిత సంతానంతోనే ప్రయోజనాలు

పరిమిత సంతానంతోనే ప్రయోజనాలు

  •   డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌
  •   ప్రపంచ జనాభా దినోత్సవం

పెద్దపల్లి రూరల్‌: పరిమిత సంతానంతో బహుళ ప్రయోజనాలుంటాయని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యాధికారి కార్యాలయ ఆవరణలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమోద్‌కుమార్‌ మాట్లాడుతూ, జనాభా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఉద్ఘాటించారు. కుటుంబ నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.   అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలు, పరిమిత సంతానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. 2027 నాటికి దేశ జనాభా 163 కోట్లకు చేరుకొని ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.  రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల సగటు స్త్రీ సంతానోత్పత్తి రేటు 1.78 ఉందని, ఉత్తరాది రాష్ర్టాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నామని అన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ కిశోర్‌ కుమార్‌, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ ఫణింద్ర, రాఘవాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ మమత, మాస్‌ మీడియా అధికారి  బాలయ్య, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.

ధూళికట్టలో..

ఎలిగేడు: మండలంలోని ధూళికట్ట గ్రామ సర్పంచ్‌ కావేరి ఆధ్వర్యంలో స్థానిక అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, తల్లులకు పోషకాహార సరుకులు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఇక్కడ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మండలకేంద్రమైన ఎలిగేడులో కూడా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఇక్కడ సర్పంచ్‌ బూర్ల సింధూజ, ఉప సర్పంచ్‌ వెంకటేశ్వర్‌రావు, జీపీ పాలకవర్గ సభ్యులు ఉన్నారు.


logo