గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jul 11, 2020 , 00:55:47

ధాన్యం ఆరబోతకు తప్పనున్న తిప్పలు

ధాన్యం ఆరబోతకు తప్పనున్న తిప్పలు

దహెగాం: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఆరబెట్టుకునేందుకు రైతులు తిప్పలు పడేవారు. కొంతమందికి కల్లా లు, స్థలాలు లేక రోడ్డు పక్కన ధాన్యం ఆరబోసేవారు. రైతుల ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రాల వద్దే కల్లాలు ఏర్పాటు చేసుకోవాలని నిధులు మంజూరు చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులు వెచ్చించి కల్లాల నిర్మాణం చేపట్టనున్నారు.

కల్లాల నిర్మాణానికి నిధులు 

కల్లాలు నిర్మించుకునే రైతులు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. ఒక యూనిట్‌ విలువ ఈ విధంగా ఉంటుంది. 50 చదరపు అడుగుల కల్లం నిర్మాణానికి రూ.56 వేలు, 60 చదరపు అడుగుల కల్లానికి రూ. 68 వేలు, 76 చదరపు అడుగుల కల్లానికి రూ. 85వేల చొప్పున ప్రభుత్వం చెల్లించనున్నది. బీసీ, జనరల్‌ వర్గాలకు చెందిన రైతులు యూనిట్‌ విలువలో 10 శాతం వా టాను చెల్లించాలి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీ ప్రభుత్వం అం దించనున్నది. 

పండించిన పంట చేతికి అందిన తర్వాత దానిలో తేమ శాతం లేకుండా చేసేందుకు రోడ్డు పక్కన ఆరబోసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రభుత్వం కల్లాలు నిర్మించడంతో సమస్య తీరుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తున్నది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కల్లాన్ని నిర్మించేందకు ప్రతిపాదనలు పంపుతున్నాం. తదుపరి ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కల్లం నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. కల్లాల నిర్మాణాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.


logo