సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Jul 10, 2020 , 02:34:38

రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయం

రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయం

  • n మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు
  • n లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల్లో పర్యటన
  • n రైతు వేదిక భవన నిర్మాణ పనులు,   కంపోస్టు షెడ్ల ప్రారంభం 

లక్షెట్టిపేట రూరల్‌/మంచిర్యాల రూరల్‌ (హాజీ పూర్‌) : రైతు సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యే యమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. లక్షెట్టిపేట మండలంలోని సూ రారం, దౌడేపల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణ పనులను గురువారం ఆయ న ప్రారంభించారు. హాజీపూర్‌ మండలం ముల్క ల్లలో జాతీయ రహదారి వెంట మురుగు కాలువ నిర్మాణ పనులను ఎంపీపీ మందపెల్లి స్వర్ణలతతో కలిసి ప్రారంభించారు. ముల్కల్ల, నర్సింగాపూర్‌, రాపల్లి, హాజీపూర్‌, దొనబండ,  కర్నమామిడి, బు ద్దిపల్లి, పెద్దంపేట గ్రామాల్లో నిర్మించిన కంపోస్టు షెడ్లను ప్రారంభించారు. ఆయా చోట్ల ఎమ్మెల్యే మాట్లాడారు. జలహితం పేరుతో కాలువల్లోని పూడిక తీస్తూ సాగునీరు సాఫీగా అందేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణాలను అందుబాటులోకి తెస్తామన్నారు. 25వ తేదీలోగా వైకుంఠ ధా మాలు, డంప్‌ యార్డులు, కంపోస్టు షెడ్ల నిర్మాణా లను పూర్తి చేయాలని సూచించారు. ఆయా కార్య క్రమాల్లో డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగన్న, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల గురువయ్య, జడ్పీ సీఈవో నరేందర్‌, మున్సిపల్‌ చైర్మ న్‌ నల్మాస్‌ కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడే టి శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీటీసీ పూస్కూరి శిల్ప, తహసీల్దార్‌ పుష్పలత, ఎంపీడీవోలు సత్యనారాయణ, అబ్దుల్‌ హై, ఏవో ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షులు చుంచు చిన్నయ్య, మొగిళి శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ బేతు రమాదేవి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ రావు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్‌, పీఏ సీఎస్‌ల చైర్మన్లు సందెల వెంకటేశ్‌, రామారావు, కొట్టె సత్తయ్య, మాజీ వైస్‌ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్‌, సాగి వెంకటేశ్వర్‌ రావు, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు నయీంపాషా, రఫీక్‌, ఎంపీటీసీలు దావీ ద్‌, సత్తయ్య, సర్పంచ్‌లు శంకరయ్య, శ్యామల, రాజేశ్వరి, ఏపీవో మల్లయ్య, నాయకులు రాజ న్న, శ్రీనివాస్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, వేణు, పాదం శ్రీనివాస్‌, రాజన్న, సురేశ్‌, బేతు రవి,  అధికారు లు, తదితరులు పాల్గొన్నారు. logo