బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Jul 10, 2020 , 02:35:02

ఆధునిక పద్ద్ధతిలో పబ్లిక్‌ టాయిలెట్స్‌

ఆధునిక పద్ద్ధతిలో పబ్లిక్‌ టాయిలెట్స్‌

  •   అన్ని వసతులు ఏర్పాటు
  •   రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌

కార్పొరేషన్‌: నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో అత్యాధునిక పద్ధతిలో, అన్ని సదుపాయాలతో పబ్లిక్‌ టాయిలెట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. స్థానిక భగత్‌సింగ్‌ చౌరస్తా వద్ద నూతనంగా చేపడుతున్న పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణ పనులకు కలెక్టర్‌ శశాంకతో కలిసి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పబ్లిక్‌ మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇందుకు ప్రైవేట్‌ భాగస్వామ్యం తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో వచ్చే నెల రోజుల్లో హైటెక్‌ హంగులతో కూడిన 15 పబ్లిక్‌ మురుగుదొడ్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న వాటిలో దివ్యాంగులు, పురుషులు, మహిళలకు వేర్వేరు సదుపాయాలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌బాబు, రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, నగర మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, కార్పొరేటర్‌ తోట రాములు, దిండిగాల మహేశ్‌,  గుగ్గిళ్ల జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

మొక్కలను సంరక్షించాలి

కరీంనగర్‌లో ఆరో విడుత హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కళాశాల ఆవరణలో 35 ఎకరాల స్థలంలో ఎక్కడెక్కడ ఖాళీ స్థలం ఉందో గుర్తించి బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేయాలన్నారు. ఈ నెలాఖరులోగా ఇచ్చిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. నగరంలో ఏఈల వారీగా ఇచ్చిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేసి వాటిని నాటించి సంరక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు. కరీంనగర్‌ను హరితనగరంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైన ప్రాంతాల్లో మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శశాంక, మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్‌ కోల భాగ్యలక్ష్మి, నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. logo