గురువారం 06 ఆగస్టు 2020
Mancherial - Jul 08, 2020 , 01:26:15

సమన్వయంతో పని చేయాలి

సమన్వయంతో పని చేయాలి

మందమర్రి రూరల్‌ : అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. స్థానిక సీఈఆర్‌ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మండల సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ, హరితహారం, పల్లె ప్రగతి, ప్రకృతి వనాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాళేశ్వరం నుంచి చెన్నూర్‌ వరకు సాగు నీరు అందించేందుకు అన్ని పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరందుతుందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు వస్తే చెన్నూర్‌ నియోజకవర్గంలో 1. 35 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ పనులు ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ ద్వారా 78 రకాల పనులు చేపట్టాలని సూచించారు. ఇందుకు మందమర్రి మండలంలో రూ. 14 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. మండలంలో మొత్తం 28 చెరువులు ఉండగా, కేవలం 18 చెరువుల్లోనే పూడిక తీశారని చెప్పారు. డంప్‌ యార్డులు, శ్మశాన వాటిక పనులు పూర్తి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన గ్రామాలకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. అంతకు ముందు సారంగపల్లిలో డంప్‌ యార్డును ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి, ఎంపీపీ గుర్రం మంగ, జడ్పీటీసీ వేల్పుల రవి, తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎస్‌ ప్రభాకర్‌, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల అధికారులు పాల్గొన్నారు.  

ప్రభుత్వ భూములను కాపాడాలి  

భీమారం : ప్రభుత్వ భూములను కాపాడాలని, కబ్జా కాకుండా చూడాలని విప్‌ బాల్క సుమన్‌ సూచించారు. భీమారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సర్వే నంబర్‌ 138లోని ప్రభుత్వ భూమిని కాపాడాలని, కబ్జా చేసిన తొలగించాలని సూచించారు. అనంతరం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు.  డీసీఎంఎస్‌లో ధాన్యం విక్రయించగా నిర్వాహకుడు చల్ల సుధాకర్‌ రెడ్డి ఎక్కువ మొత్తంలో కోత విధించాడంటూ పోతన్‌పల్లికి చెందిన రైతులు ఇటీవల విప్‌ సుమన్‌ దృష్టికి తీసుకెళ్లారు.  ఈ విషయమై విప్‌ సుమన్‌ మండల కేంద్రంలోని డీసీఎంఎస్‌ నిర్వాహకుడు చల్ల సుధాకర్‌ రెడ్డితో మాట్లాడారు. పోతన్‌పల్లికి చెందిన 60 మంది రైతులకు న్యాయం చేయాలని ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు.   

‘డబుల్‌ బెడ్రూం’ పనులు వేగవంతం చేయండి

మందమర్రి : డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ సూచించారు. పట్టణంలోని పాలచెట్టు ఏరియాలో కొనసాగుతున్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులను మంగళవారం పరిశీలించారు. లాక్‌డౌన్‌ కారణంగా పను లు నిలిచినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కూలీల కొరత ఏర్పడిందన్నారు. నిర్మాణ పనులను వేగ వంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికా రులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన వెంట జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి, కమిషనర్‌ గద్దె రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు జే రవీందర్‌, మేడిపల్లి సంపత్‌, కొంగల తిరుపతిరెడ్డి, ఈశ్వర్‌, ఎర్ర రాజు, తోట సురేందర్‌, భట్టు రాజ్‌కుమార్‌, గుడ్ల రమేశ్‌, మేడిపల్లి మల్లేశ్‌, మంద తిరుమల్‌రెడ్డి, పాణి, బోరిగం వెంకటేశ్‌, తుమ్మ శ్రీశైలం పాల్గొన్నారు. 

రేషన్‌ డీలర్లకు చెక్కుల పంపిణీ

రేషన్‌ డీలర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన కమీషన్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పంపిణీ చేశారు. మూడు నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన రేషన్‌ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన కమీషన్‌ మంజూరు చేసింది. స్థానిక సీఈఆర్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విప్‌ సుమన్‌ డీలర్లకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముగ్గురికి ఆర్థికసాయం మంజూరు కాగా, వారికి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్‌ గోపాల్‌,  డీలర్లు పాల్గొన్నారు.  

తాజావార్తలు


logo