ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jul 08, 2020 , 01:20:18

బొగ్గు రవాణా వ్యాగన్ల సరఫరా పెంచుతాం

బొగ్గు రవాణా వ్యాగన్ల సరఫరా పెంచుతాం

రామకృష్ణాపూర్‌; సింగరేణిలో దసరా, దీపావళిలోగా బొగ్గు రవాణాకు  రేకుల (వ్యాగన్ల) సరఫరా పెంచుతామని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే రామగుండం రీజియన్‌ ఏరియా ఆఫీసర్‌ సుభాన్‌ జైన్‌ అన్నారు. మంగళవారం సింగరేణి సంస్థలోని మందమర్రి ఏరియా ఇంజినీర్‌ జగన్మోహన్‌రావుతో కలిసి ఆర్కేపీ సీహెచ్‌పీ సైడింగ్‌ను పరిశీలించారు.  కరోనా సందర్భంగా డిస్పాచ్‌ పొజిషన్‌ లింకేజీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అన్ని కలిపి సుమారు 2 వేల రైళ్లకు కేవలం 100 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయన్నారు. కరోనా ప్రభావం రైల్వేస్‌ మీద కూడా తీవ్రంగా ఉందని, దీంతో చాలా నష్టం జరుగుతున్నదన్నారు.  కార్యక్రమంలో సీనియర్‌ స్టేషన్‌ సూపరింటెండెంట్‌ బాలరాజు, ఆర్కేపీ సీహెచ్‌పీ డీజీఎం చెరువు శ్రీనివాస్‌, డీవై ఎస్‌.ఈ చంద్రమౌళి, సివిల్‌ ఎస్‌ఈ రవికుమార్‌, పిట్‌ కార్యదర్శులు ఆత్రం సంజీవ్‌, సూపర్‌వైజర్‌ గంగాధర్‌  పాల్గొన్నారు.


logo