సోమవారం 03 ఆగస్టు 2020
Mancherial - Jul 02, 2020 , 03:41:28

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

మంచిర్యాల రూరల్ (హాజీపూర్): జిల్లాలోని 2020-21 విద్యా సంవత్సరానికి గాను అత్యుత్త మ జూనియర్ కళాశాలల ఎంపికకు ఆన్‌లైన్‌లో ద రఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కా ర్పొరేట్, ప్రైవేట్ కళాశాలల ప్రవేశ పథకంలో భా గంగా ఉత్తమ కళాశాలలను ఎంపిక చేసేందుకు జి ల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. కళాశాలల ఎంపిక విద్యార్థులను(విద్యార్థుల ఆప్షన్ ప్రకారం) ప్రతి విద్యా సంవత్సరం కేటాయించ డం జరుగుతుందన్నారు. ఫీజు, బుక్స్, హాస్టల్, భోజన  వసతి, ఇతర అవసరాలకు ప్రతి విద్యార్థికి రూ. 35 వేల  చొప్పున చెల్లిస్తామన్నారు. పాకె ట్ మనీగా ప్రతి విద్యార్థికి రూ.3 వేలు అందజేస్తామని చెప్పారు. ఆసక్తి గల జూనియర్ కళాశాలల యాజమాన్యాలు epass.telangana.gov.in లో 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రతిని 10వ తేదీలోగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందజేయాలని, అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఆమె సూచించారు.


logo