సోమవారం 03 ఆగస్టు 2020
Mancherial - Jul 02, 2020 , 03:41:29

ఆయిల్ పామ్‌తో లాభాలు

ఆయిల్ పామ్‌తో లాభాలు

  • n రైతులంతా సాగుకు ముందుకు రావాలి
  • n ప్రభుత్వ విప్ బాల్క సుమన్
  • n మద్దికల్‌లో ఎమ్మెల్సీ పురాణంతో కలిసి మొక్కలు నాటి భూమి పూజ

భీమారం: ఆయిల్ పామ్‌తో అధిక లాభా లు సాధించవచ్చని, రైతులు సాగు చేసేందుకు ముందుకు రావాలని ప్రభుత్వ విప్ బాల్క సు మన్, పురాణం సతీశ్ కుమార్ పిలుపునిచ్చా రు. అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, దీపక్ కు మార్, జడ్పీటీసీ భూక్యా తిరుమల నాయక్, సర్పంచ్ ఓడెటి వాణితో కలిసి మద్దికల్ పట్టణంలో బుధవారం మొక్కలు నాటారు. చె న్నూర్ పట్టణానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు  చింతంబట్ల జ్యోతి-శశికాంత్ రావు ఆ యిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చారు. తమకున్న ఐదు ఎకరాల్లో మొక్కలు నాటగా, వారిని విప్ అభినందించారు. మరో ఐదెకరా ల్లో కూడా సాగు చేస్తామని శశికాంత్ తెలి పాడు. చెన్నూర్ నియోజకవర్గంలో ప్రతి రైతు సాగు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సాగులో అధిక లాభాలు ఉన్నాయని తెలిపా రు. రైతు బంధు సమితి కోఆర్డినేటర్ కలగూర రాజ్ కుమార్, చెన్నూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వేముల శ్రీకాంత్ గౌడ్, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొత్తపోటు రాజేశ్వర్ రెడ్డి, నాయకులు చిలగాని కనకయ్య, ఓడేటి బలరాం రెడ్డి, భూక్యా లక్ష్మణ్, ఆత్కూరి రా ము, పోడెటి రవి, చిప్ప పూరుషోత్తం, మహే శ్వర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో శ్రీప తి బాపు, తదితరులు పాల్గొన్నారు. 

జలహితంతో ఉపాధి

జలహితంతో రైతులతోపాటు ఉపాధి కూలీ లబ్ధి చేకూరుతుందని విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ పేర్కొన్నా రు. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో గొల్లవాగు కెనాల్‌పై జడ్పీటీసీ భుక్యా తిరుమల నా యక్, సర్పంచ్ గద్దె రాం రెడ్డి, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పూడిక తీత, పిచ్చి మొక్కల తొలిగింపు పనులు ప్రారంభించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాసరి మధునయ్య పాల్గొన్నారు. శ్రీరాంపూర్ సర్కిల్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్‌ఐ కిరణ్ కుమార్ బందోబస్తు నిర్వహించారు. 

సెంట్రల్ లైటింగ్ ప్రారంభం

కోటపల్లి: మండల కేంద్రంలో ఏర్పాటు చే సిన సెంట్రల్ లైటింగ్‌ను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి  ప్రారంభించారు. అనంతరం విప్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని, మంజూరు పత్రాలను త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీ మంత్రి సురేఖ, సర్పంచ్ రాగం రాజక్క, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బైస ప్రభాకర్, సర్పంచ్‌లు ముల్కల్ల ఉమ, పసునూటి వసంత కుమారి, అక్కల మధూకర్, ఎంపీటీసీలు పుప్పిరెడ్డి మొండక్క, చంద్రగిరి శంకయ్య, మండల నా యకులు మంత్రి రామయ్య, రాళ్లబండి శ్రీనివాస్, రాగం స్వామి, ముల్కల్ల శశిపాల్ రెడ్డి, పసూనూటి అరవింద్, బైస రాజన్న, తది తరులు పాల్గొన్నారు.


logo