గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jul 02, 2020 , 03:41:31

సమ్మెకు సై..

సమ్మెకు సై..

  • n బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను  నిరసిస్తూ నేడు సింగరేణి వ్యాప్తంగా సమ్మె 
  • n టీబీజీకేఎస్ పిలుపునకు  కార్మికులు సన్నద్ధం

 మంచిర్యాల, నమస్తే తెలంగాణ : బొగ్గు బ్లాకు ల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణిలో గురువారం సమ్మె చేపట్టేందుకు కార్మికులు సన్నద్ధమయ్యారు. ఒక్క రోజు సమ్మెకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లనుంది. ఓ రకంగా సంస్థ భవిష్యత్ అంధకారంలో కూరుకుపోనుంది. ఈ వైఖరిని నిరసిస్తూ కార్మికులు సమ్మె చేపట్టనున్నారు. జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజులు సమ్మెకు పిలుపునివ్వగా, టీబీజీకేఎస్ ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. కేంద్రం ప్రైవేటు వ్యక్తులకు ఎర్ర తివాచీ పరిచి ఈ బ్లాక్‌లను కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నదని అర్థమవుతోందని కార్మికులు చెబుతున్నారు. కరోనా సమయంలో కార్మికులకు అండగా ఉండాల్సింది పో యి విదేశీయులు, ప్రైవేటు వ్యక్తులకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తోందని మండిపడుతున్నా రు. గతంలో బొగ్గు బ్లాకులు కేటాయించేప్పుడు ఎలాంటి రాయితీలు ప్రకటించలేదని, ఇప్పుడు కొత్త బొగ్గు బ్లాకులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం సిగ్గు చేటని సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. బొగ్గు బ్లాకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే వారు కనీసం కార్మిక చట్టాలు అమలు చే యరని, వేతన ఒప్పందాలు, కార్మిక సంక్షేమం ఎండమావేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే విస్తృతంగా ప్రచారం.. 

సింగరేణి వ్యాప్తంగా సమ్మె విషయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు కార్మికులను సిద్ధం చేశారు. గనులు, డిపార్ట్‌మెం ట్ల మీద విస్తృత ప్రచారం చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనం చేశారు. ఆ యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మి ర్యాల రాజిరెడ్డితో సహా పలువురు నాయకులు ప్రచారం చేశారు. సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, చేస్తున్న ద్రో హాన్ని వివరించారు. ఇప్పటి వరకు కేంద్రం సిం గరేణికి కనీసం ఒక్క రూపాయి ఇవ్వలేదని, పై గా ఇక్కడ నుంచే పన్నుల రూపేణా వేల కోట్లు తీసుకెళ్తున్న వైనంపై అవగాహన కల్పించారు. దీంతో సమ్మెకు సిద్ధమని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ది చెబుతామని వెల్లడిస్తున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా ఉన్న మూ డు ఏరియాల్లో ఆయా ప్రాంతాల్లో ఉపాధ్యక్షు లు, టీబీజీకేఎస్ నేతలు విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తున్నారు. సమ్మె విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. 


logo