మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Jul 01, 2020 , 03:28:06

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

  •  ఎస్పీ రాహుల్‌ హెగ్డే 

గంభీరావుపేట: ప్రభుత్వ హరితహారం కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే పేర్కొన్నారు. మంగళవారం  పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎస్పీ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆరో విడుత              హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 

యోగా క్రీడాకారుడికి రూ.50 వేలు..

మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు పెరిమల్ల దేవయ్యకు ఎస్పీ రూ.50 వేల ఆర్థిక సహాయం చేశారు. జాతీయ పోలీస్‌ అకాడమీలో పనిచేసి తన సేవలు అందించిన దేవయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయితేజ అండ్‌ ఫీడ్‌ ది నీడ్‌ అనే ఎన్జీవో సంస్థ అందించిన సహకారంతో ఎస్పీ వారికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, సర్పంచ్‌ అక్కపల్లి స్వరూప, డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐలు బన్సీలాల్‌, సర్వర్‌, ఎస్‌ఐలు నీలం రవి, వెంకటకృష్ణ, రామచంద్రం, సిబ్బంది ఉన్నారు. 

చెట్లే జీవనాధారం..

ఎల్లారెడ్డిపేట: చెట్లే మానవాళికి జీవనాధారమని ఎస్పీ రాహుల్‌హెగ్డే పేర్కొన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట ఠాణాలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని మొ క్కలు నాటారు. పోలీస్‌ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఆటో యూనియన్‌ సభ్యులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కా ర్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ బన్సీలా ల్‌, ఎస్‌ఐ వెంకటకష్ణ, ఆటోయూనియన్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

పోలీసుల కోసం ప్రత్యేక చర్యలు

సిరిసిల్ల క్రైం: జిల్లాలో పోలీస్‌ సిబ్బంది కరో నా వైరస్‌ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం పోలీసు సిబ్బందికి ఆరోగ్య కిట్లను అందజేసి, మాట్లాడారు. కరోనా బారిన పడకుండా పోలీస్‌ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో ఉన్న వారు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సిబ్బందికి ఆరోగ్య కిట్లను అందజేశామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్‌, గుండె, ఊపిరితిత్తుల  సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. 50 సంవత్సరాలు దాటిన వారు పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే విధులకు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రారంభం

తంగళ్లపల్లి మండలం తాడూరు శివారులోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఎస్పీ రాహుల్‌ హెగ్డే మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. ట్రాఫిక్‌ డ్యూటీ నిర్వహించే కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ అందిస్తామన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి, ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన వా రికి కౌన్సెలింగ్‌ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు సంపత్‌కుమార్‌, కుమారస్వామి,ఎస్‌ఐలు అభిలాష్‌, రామచంద్రంలు ఉన్నారు.

ఏఆర్‌ ఎస్‌ఐ పద్మయ్యకు సన్మానం

హెడ్‌క్వార్టర్స్‌లోని ఏఆర్‌ ఎస్‌ఐ పద్మయ్య మంగళవారం ఉద్యోగ విరమణ పొందగా, జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సన్మానించారు. భావి జీవితాన్ని సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. రిటైర్ట్‌మెంట్‌ బెనిఫిట్‌ పత్రాలు అందజేశారు. ఇందులో ఆర్‌ఐ సంపత్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.logo