సోమవారం 06 జూలై 2020
Mancherial - Jun 30, 2020 , 02:35:55

శిశు మందిర్ అభివృద్ధికి కృషి

శిశు మందిర్ అభివృద్ధికి కృషి

ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ వేతనాలతో చక్కని విద్యను అందిస్తూ సమాజంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఆచార్యులను అభినందించారు. పాఠశాల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు, పోషకులు కూడా తమవంతు సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, గుండి ఎంపీటీసీ గాదవేణి మల్లేశ్, పాఠశాల జిల్లా కార్యదర్శి గోవిందరావు, శిశు మందిర్ విద్యపీఠం కమిటీ అధ్యక్షుడు బోనగిరి సతీశ్‌బాబు, సహాయ కార్యదర్శి కోట వెంకన్న, ప్రధానాచార్యులు కోటేశ్వర్ పాల్గొన్నారు.


logo