బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Jun 30, 2020 , 02:35:55

రేపు తొలి ఏకాదశి

రేపు తొలి ఏకాదశి

  • నిరాడంబరంగా నిర్వహించుకోనున్న ప్రజలు

మంచిర్యాల రూరల్ (హాజీపూర్): హిందూ సంప్రదాయంలో ధర్మాలు నిర్వర్తించడం కోసం పండుగలను నిర్వహిస్తారు. ఈ పర్వాలను తిథుల ప్రకారం నిర్ణయించారు. ఇం దు లో ముఖ్యమైనది ఏకాదశి. ఈ తిథి ప్రతి మా సం శుక్ల పక్షంలో, బహుళ పక్షంలో వస్తుంది. నెలకు రెండు చొప్పున 12 నెలలకు 24 ఏకాదశులు ఉంటాయి. వీటిలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఏకాదశి తిథి శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతివంతమైనది. అందుకే ఏ కాదశిని హరివాసరం అని కూడా పిలుస్తారు. ఇందులో ముఖ్యమైనది ఆషాఢ శుక్ల ఏకాదశి. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. బుధవారం తొలి ఏకాదశితోనే పండుగలు ప్రారంభమవుతాయి. 

విశిష్టత

తొలి ఏకాదశి విశిష్టమైనది. ఈ రోజు విష్ణు శయనోత్సవం నిర్వహిస్తారు. శేషశాయి లక్ష్మీనారాయణలిద్దరిని ఈ రోజు పూజిస్తారు. ఏకాదశి పర్వదినాన కనీసం ఒక్కపూటైనా ఉపవా సం పాటించడం ఆచారం. ఈ రోజు నుంచే చ తుర్మాస వ్రతం ప్రారంభమౌవుతుంది. శివ, విష్ణు భక్తులిద్దరు చేసే వ్రతం ఇది. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు మాసాల పాటు వ్రతం చేస్తారు. ఈ నాలుగు నెలలు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ గడపాలి. విష్ణువుకు నివేదన చేశాకే ఆహారం తీసుకుంటారు. మాంసాహారం, గుమ్మడి కాయ, పుచ్చకాయ, చెరుకు, కొత్త ఉసిరిక, చింతపండు, బయటి భోజనం, తేనె, పొట్లకాయ, ఉలువలు, తెల్ల ఆవాలు, మినుములను ఈ నాలు గు నెలల పాటు వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్యం కోసం ఈ వ్రతమని పెద్దలు అంటుంటారు. వర్షాకాలం ప్రారంభమవుతుంది కనుక ఈ కాలంలో క్రిమి కీటకాలతో కొత్తరోగాలు రావడం సహాజం. అందువల్లే ఈ పదార్థాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.

తొలి ఏకాదశి ప్రాశ్యస్తం

దీన్నే ఆషాఢ శుద్ధ ఏకాదశి, నయన ఏకాదశి అంటారు. పూర్వం ఏడాదికి మూడు రు తువులే లెక్కగా చెప్పేవారు. వర్ష రుతువు నుంచి ఏడాదిగా పరిగణించ బడుతున్నందున ఈ ఏకాదశి తొలి ఏకాదశి అయ్యింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు ఉండే కాలాన్ని చతుర్మాసంగా పిలుస్తా రు. ఈ రోజుల్లో విష్ణుమూర్తి పాల సముద్రం లో పవళించి ఉంటాడు. శంఖాసురుడనే రాక్షసుడిని సంహరించిన విష్ణువు సంహార సమయంలో ఏర్పడిన అలసటను తీర్చుకునేందు కు నాలుగు నెలలపాటు శయనిస్తాడు. ఆ నెలలనే చాతుర్మాస్యంగా పేర్కొంటారు. అందుకే చాతుర్మాస్యంలో చేసే స్నాన, తీర్థ యాత్రల సందర్శన, జప, దానాదులు అక్షయ ఫిలితా న్ని ఇస్తాయని శాస్త్ర వచనం తెలుపుతుంది. నదీ స్నానాంతరం పితృ దేవతలకు సంతర్ఫణ చేస్తే వారు సంతృప్తులవుతారని విశ్వసిస్తారు. తొల ఏకాదశి నుంచి సూర్యుడు దక్షిణాయమవడం, దక్షిణ దిశగా వాలినట్లు కనబడడంతో విష్ణువు శయనించాడని చెబుతారు. ఏకాదశి నుంచి కార్తీక పున్నమి వరకు తీర్థయాత్రలు, దానాలు, ఆలయాలు విష్ణుమూర్తి శరణు పొం దుతాయి. ఈ నాలుగు నెలల కాలం భౌతిక అంతరంగ శుద్ధి సాధిస్తే విష్ణు సానిధ్యం లభిస్తుందని పురాణాలు ప్రవచిస్తున్నాయి. దీక్ష చేపట్టకపోయినా వ్రతంలో ఉన్న వారి సాంగత్యంతో ఉన్నా ఫలితాలు చేకూరుతాయి. తొలి ఏకాదశి నుంచే పర్వదినాలు ప్రారంభమౌవుతాయి. ఈ పండుగకు మెట్టినింటి నుంచి పు ట్టంటికి చేరిన నవ వధువులు, అల్లుళ్లతో పం డుగ సందడి కనిపిస్తుంది. పండుగకు పండి వంటలు చేయడం ఆనవాయితీ.


logo