మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jun 30, 2020 , 02:35:56

బొగ్గు గనుల ప్రైవేటీకరణను విరమించుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణను విరమించుకోవాలి

  • n నిరసన తెలిపిన నాయకులు

రెబ్బెన: కేంద్ర ప్రభుత్వం 41 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చేయడాన్ని విరమించుకోవాలని సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరికొండ సత్యనారాయణ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి జీఎం కార్యాలయ ఆవరణలో సోమవారం ఎస్సీ ఎస్టీ యూనియన్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం జీఎం కొండయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బూడిద గోపాలకృష్ణ, సంజేష్‌జాదవ్, రవీందర్, రాంచందర్, రాము, విష్ణు, దేవేందర్, రమేశ్, నాగేంద్ర, నరేశ్ పాల్గొన్నారు.

సమ్మెను విజయవంతం చేయాలి 

కేంద్రం బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించే 72 గంటల సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్, ఐఎఫ్‌టీయూ బెల్లంపల్లి డివిజన్ అధ్యక్షుడు బండారు తిరుపతి పిలుపునిచ్చారు. సోమవారం బెల్లంపల్లి ఏరియా గోలేటి సివిల్ డిపార్డుమెంట్, వర్క్‌షాప్ వద్ద  నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ సమ్మెలో కాంట్రాక్టు కార్మికులు అందరూ పాల్గొనాలని కోరారు.  కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు. logo