బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Jun 29, 2020 , 00:17:01

గ్రామ దేవతలకు పూజలు

గ్రామ దేవతలకు పూజలు

దండేపల్లి / లక్షెట్టిపేట రూరల్‌ / తాండూర్‌ / బెజ్జూర్‌ :  ఆషాఢం సందర్భంగా గ్రామాల్లో ఆదివాసులు గిరిజన సంప్రదాయాలతో  ఆ దివారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని మండలాల్లో అకాడి నిర్వహించుకున్నారు. ఉదయమే బిం దెల్లో నీరు నింపుకొని డప్పుచప్పుళ్లతో గ్రామ పొలిమేరల్లో దారిపై నీళ్లు ఆరిగించారు. పూజారులు పసుపు, కుంకుమతో కట్టుకట్టి గ్రామ దేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఊరిలో ఒక్కోదారికి ఒక్కో దేవతలైన ముత్యాలమ్మ, పోలేర మ్మ, గొంతెమ్మ, భూలక్ష్మి, మారెమ్మ, భీమ దేవర, పోచమ్మ కు మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ కు కోడి పుంజులు, రహదారులపై ఆయా దేవతలకు మేకపోతులను బలిచ్చారు. ఇం డ్లలో గారెలు, బూరెలు, ఇతర ప్రత్యేక వం టలు, నైవేద్యంగా వండారు. వానకాలం పాడి పంటలు, పిల్లాపాపలను సల్లంగ సూ డాలని, కరోనా వైరస్‌తో వచ్చే రోగం వ్యా పించకుండా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నట్లు గిరిజనులు తెలిపారు. logo