శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Jun 28, 2020 , 02:59:08

స్వదేశీ ముసుగులో ప్రైవేటీకరణ కుట్ర

స్వదేశీ ముసుగులో ప్రైవేటీకరణ కుట్ర

  •   జూలై 2న సింగరేణిలో సమ్మె
  •  టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్

శ్రీరాంపూర్ :  ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం స్వదేశీ ము సుగులో ఎఫ్ గనుల ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతున్నదని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. శ్రీరాంపూర్ ప్రెస్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బొగ్గు గనుల ప్రైవేటీకరణ, విద్యుత్ సవరణ బిల్లు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత పిలుపు మేరకు సింగరేణిలో జూలై 2న బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చారని చెప్పారు. గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాలు నిరవదిక సమ్మె చేయాలని, అవసరమైతే తాము పాల్గొని పోరాడుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మతం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి గనులు ప్రైవేటీకరణ కావన్నారు. గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జార్ఖండ్ ప్రభుత్వం కోర్టులో కేసు వేసిందన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు బడికెల సంపత్ కే సురేందర్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రీజియన్ కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు  పాల్గొన్నారు. 

జాతి సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకే..

దేశంలోని జాతి సంపదను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు, విదేశీ సంస్థల కు అప్పగించడానికే బొగ్గు గనుల ప్రైవేటీకరణకు పూనుకుంటున్నదని, కార్మిక వర్గం ఈ నిర్నయాన్ని సమ్మె పోరాటంతో తిప్పికొట్టాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ పిలునిచ్చారు. శ్రీరాంపూర్ ఆర్ గనిపై ఉపాధ్యక్షుడు కే సురేందర్ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు పరిశ్రమలో ప్రైవేట్ ఆధిపత్యాన్ని తీసుకరావడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సమావేశంలో నస్పూర్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధులు కే వీరభద్రయ్య, ఏనుగు రవీందర్ రీజియన్ కార్యదర్శి మంద మల్లారెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి పానగంటి సత్తయ్య, ఏరియా చర్చల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన: సమ్మెను విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి తెలంగాణభవన్ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఏరియా టీబీజీకేఎస్ కార్యకర్తల సమావేశానికి ఆసిఫాబాద్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, దుర్గం చి న్నయ్య, టీబీజీకేఎస్ ప్రధానకార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నామన్నా రు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మ ల్రాజు శ్రీనివాసరావు,  కేంద్రకమిటీ ఉపాధ్యక్షుడు బడికెల సంపత్ కార్పొరేట్ చర్చల ప్రతినిధి దారవత్ మంగిలాల్, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్ ఏరి యా కమిటి, మైన్స్ కమిటీనాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు. logo