శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jun 27, 2020 , 02:22:58

మొక్కలు నాటి సంరక్షించాలి

మొక్కలు నాటి సంరక్షించాలి

  • nఆసిఫాబాద్‌ ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌
  • n  రెండో రోజూ కొనసాగిన హరితహారం      

ఆసిఫాబాద్‌: మండలంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌ యాదవ్‌ అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా శుక్రవారం బూరుగూడ గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఇంట్లో ఆరు మొక్కల చొప్పున నాటాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మాధవి, ఎంపీటీసీ రమేశ్‌, నాయకులు కుమార్‌ పాల్గొన్నారు.

బెజ్జూర్‌:  ఆరో విడుత హరితహారంలో భాగంగా మండల కేంద్రంతో పాటు మర్తిడి, పాపన్‌పేట, సులుగుపల్లి, అంబాగట్‌ గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులు, కార్యాలయాల్లో అధికారులు శుక్రవారం మొక్కలు నాటారు. సహకార సంఘంలో సీఈవో వెంకటేశ్వర్‌ గౌడ్‌, సిబ్బంది దేవాజి మొక్కలు నాటారు. 

దహెగాం: మండలంలో రెండో రోజూ శుక్రవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పెసర్‌కుంట, కోత్మీర్‌, ఇట్యాల గ్రామాల్లో ఎంపీడీవో సత్యనారాయణ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీవో రాజేశ్వర్‌, సర్పంచ్‌లు నక్క జ్యోతి, సుల్తానా, కార్యదర్శులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: పట్టణంలోని 4వ వార్డులో కౌన్సిలర్‌ సాగరిక, ఐకేపీ మహిళలు మొక్కలు నాటారు. 

కౌటాల: మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో శుక్రవారం ఎంపీడీవో  ప్రభు, ఏఈ రవీందర్‌ మొక్కలు నాటారు. ప్రతి కార్యాలయం హరితవనంలా తయారు కావాలని ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో సబ్‌ ఇంజినీర్‌ అజయ్‌, ఫోర్‌మెన్‌ రమేశ్‌, ఎల్‌ఐ మాధవ్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి: మండలంలోని అంబగట్ట గ్రామంలో రాంచందర్‌కు చెందిన రెండెకరాల పొలంలో మల్బరీ మొక్కలు నాటినట్లు ఉద్యావన శాఖ అధికారి శాంతిప్రియదర్శిని తెలిపారు. మల్బరీ వల్ల అధిక దిగుబడులు వస్తాయని, ఆసక్తి గల రైతులు వివరాల కోసం 7997725041 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఆమె వెంట టీఏ ప్రకాశ్‌, నర్సయ్య ఉన్నారు.